ధన్యుడు దేవ మానవుడు || Dhanyudu Deva Manavudu Lyrics

WhatsApp Group Join Now

Dhanyudu Deva Manavudu Lyrics Telugu

ధన్యుడు దేవ మానవుడు – ధన్యుడు – ధన్యుడు దైవజనుడు
ధరణి జనులందరి కన్న – అన్యులెంతటి వారైన అతనికి సాటిరారు

|| ధన్యుడు ||

1. చెడుగుల యోచనలందు – నడువని వాడై పాపులు
అడుగు బెట్టు దారుల – యందు నిలువని యతడు

|| ధన్యుడు ||

2. పరిహసించు వ్యతిరేక – ప్రజలు గుమిగా గూర్చుండు
దరిని గూర్చుండనట్టి – నరుడెవ్వడో యతడు

|| ధన్యుడు ||

3. మరియు దైవాజ్ఞలున్న – పరిశుద్ధ శాస్త్రము జూచి
మురియుచు రేబగళ్ళు – స్మరించు చుండు నతడు

|| ధన్యుడు ||

4. అతడేటి యోర మొలిచి – ఆకు వాడనిదై తగిన
ఋతువున గాయు చెట్టై – హెచ్చరిల్లును గాన

|| ధన్యుడు ||

5. అతడు తలపెట్టి చేయ – యత్నించు నెల్ల పనులు
సతతము సంపూర్ణముగ సఫలమగు చుండును గాన

|| ధన్యుడు ||

6. అలా గుండకను దుష్టుల్ – గాలికొట్టిన పొట్టున్
బోలిన వారై చెదరి – పోదు రంతర్ధానంబై

|| ధన్యుడు ||

7. కాన దుష్టుల్ తీర్పు – లో నిల్వనే లేరు
హీనుల్ నీతిపరుల – లో నాగనే లేరు

|| ధన్యుడు ||

8. పరమ దేవునికి నీతి – పరుల మార్గంబు తెలియు
దురితుల పన్నాగములు – సరిగా కీడునకే నడుపు

|| ధన్యుడు ||

Dhanyudu Deva Manavudu Lyrics English

Dhanyudu deva manavudu – dhanyudu – dhanyudu daivajanudu
Dharani janulandari kanna – anyulenati varaina ataniki saatiraru

|| Dhanyudu ||

1. Chedugula yochana landu – naduvani vaadai paapulu
Adugu bettu daarulayandu – niluvani yatadu

|| Dhanyudu ||

2. Parihasinchu vyatireka – prajalu gumiga gurcundu
Dharini gurcundantatti – narudevvaado yatadu

|| Dhanyudu ||

3. Mariyu daivajnalunna – parishudha shaastramu juuchi
Muriyuchu rebagallu – smariyinchundu natadu

|| Dhanyudu ||

4. Atadeti yora molichi – aaku vaadanidai tagina
Rutuvuna gaayu chettai – heccarillunu gaan

|| Dhanyudu ||

5. Atadu talapetti cheya – yatninchunu nella panulu
Satatamu sampoorna muga safala magu chundunu gaana

|| Dhanyudu ||

6. Alaa gundakana dushtul – gaalikottina pottunu
Bolina vaarai chedari – podu rantardaambai

|| Dhanyudu ||

7. Kaana dushtul teerpulo – nilvane leeru
Heenul neetiparulalo – naagane leeru

|| Dhanyudu ||

8. Param devuniki neeti – parula maargambu teliyu
Duritula pannagamulu – sariga keedunake nadupu

|| Dhanyudu ||

Leave a Comment