Yeesu Janminchen Song Lyrics Telugu
యేసు జన్మించెన్ ఇలలో – యేసు జన్మించెన్ – పాపుల
కొరకును శుద్ధులకొరకును – యేసు జన్మించెన్ =
ఈ సంతసమగు వర్తమానము – ఎల్ల జనుల వీనుల మ్రోగు గాక-
విభునకు స్తోత్రము || యేసు ||
1. లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై – ఈ కాలమునకై –
లోకరక్షకుడగు యేసుడు బుట్టెను – ఆ కైసరౌగుస్తు అరయలేదు
ప్రభున్ = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము – ఏల నతడు ప్రభు-
నెరుగకపోయెనో || యేసు ||
2. భూజనాంగములకై నాకై నీకై – రాజులకై హే – రోదు రాజు
కొరకై – రాజగు యేసుడు – రంజిల్ల బుట్టెను – రాజగు హేరోదు
ప్రభువు నరయలేదు = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము –
యేల నతడు ప్రభు – నెరుగక పోయెనో || యేసు ||
3. సర్వ లోకమునకై నాకై నీకై – సర్వ వేదజ్ఞులౌ – శాస్త్రుల కొరకై –
ఉర్విని యేసుడు – ఉద్భవించెను – గర్వపు శాస్త్రులు ప్రభువు
నరయలేదు = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము యేల వారు
ప్రభు – నెరుగకపోయిరో || యేసు ||
4. నీవనుకొను ప్రతివానికై నాకై నీకై – దేవార్చకులకై – శాస్త్రుల
కొరకై – దేవనందనుడీ భువిలో బుట్టెను – ఈ వార్త చూసి వారు –
ప్రభుని పూజింప లేదు = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము –
యేల వారు ప్రభు- నెరుగక పోయిరో || యేసు ||
5. ఆ ప్రాంతపు వారికి జ్ఞానులకు – ఈ ప్రభుజన్మ సు – వార్త విన
బడియె – భూ ప్రజలీ వార్త – గ్రహియింపలేదాయె – అ ప్రజలకు చూచు –
నాశయే లేదాయె = ఇది ఆశ్చర్యము – ఎంతో విచారము – ఎందులకీ
వార్త – యెరుగక పోయిరో || యేసు ||
6. సకల మతస్థుల కొరకై నాకై – సుఖముగా జీవించు – నీ కొరకై ప్రభు
సుఖమును త్యజియించి – సుతుడై పుట్టెను – సకల మతస్థులు –
స్వామి నెరుగలేదు = ఇది ఆశ్చర్యము ఎంత విచారము –
యేల వారు ప్రభు నెరుగక పోయిరో || యేసు ||
7. అన్ని పల్లెలకై పట్టణములకై – కన్నబిడ్డలమగు – నాకై నీకై
చిన్న కుమారుడై – శ్రీ యేసు బుట్టెను – అన్నిచోట్లకిపుడీ –
వార్త తెలియుచుండెన్ = ఇది ఆశ్చర్యము – ఎంతో సంతోషము –
ఇట్లు వ్యాపింపజేయు – దేవునికి స్తోత్రము || యేసు ||
Yeesu Janminchen Song Lyrics English
Yeesu Janminchen Ilalo
Yeesu Janminchen- Paapul Korakunu Shuddhulakorakunu
Yeesu Janminchenu = Ee Santosamagu Vartamanamu
Ella Janulavina Mroguga – Vibhunaku Sthotramu || Yeesu ||
1.
Lokamu Korakunu Naakai Nikekai Aakaalamunakai
Eekaalamunakai – Lokarakshakudagu Yeesudu Buttenu
Aakaaisarougusthu Arayaledu Prabhum = Idi Aashcharyamu
Ento Vichaaramu – Yela Natadu Prabhu-Nerugakapoyen || Yeesu ||
2.
Bhoojanaangamulakai Naakai Nikekai
Raajulakai Hayerodu Raaju Korakai – Raajagha Yeesudu
Ranjilla Buttenu – Raajagha Herodu Prabhu Narayaledu = Idi Aashcharyamu
Ento Vichaaramu – Yela Natadu Prabhu-Nerugaka Poyeno || Yeesu ||
3.
Sarva Lokamunakai Naakai Nikekai
Sarva Vedhajnaulau – Shaastrula Korakai – Uuravini Yeesudu
Udbhavincheanu – Garvapu Shaastrula Prabhu Narayaledu = Idi Aashcharyamu
Ento Vichaaramu Yela Vaaru Prabhu-Nerugakapoyiro || Yeesu ||
4.
Neevanukonu Prativanikai Naakai Nikekai
Dvaararchakula Korakai – Shaastrula Korakai
Devanaandanudhi Bhuvilo Buttenu – Ee Vaarta Choosi Vaaru
Prabhunipoojimpaledu = Idi Aashcharyamu – Ento Vichaaramu || Yeesu ||
5.
Aapraantapu Vaariki Jnaanulaku
Ee Prabhu Janma Su-Vaarta Vinabadiye – Bhooprajali Vaarta
Grahi yimpaledaaye – Apprajalaku Choocha – Naashaye Ledaaye = Idi Aashcharyamu
Ento Vichaaramu – Endulakee Vaarta-Yerugaka Poyiro || Yeesu ||
6.
Sakala Matasthula Korakai Naakai
Sukhamuga Jeevinchu – Nee Korakai Prabhu
Sukhamunu Tyajiyinchi – Sutudai Puttenu
Sakala Matasthula – Swaami Nerugaledu = Idi Aashcharyamu
Ento Vichaaramu – Yela Vaaru Prabhu Nerugaka Poyiro || Yeesu ||
7.
Anni Pallelaakai Pattanaamulakai
Kannabiddalamaghu – Naakai Nikekai
Chinna Kumaraudai – Shree Yeesu Buttenu
Annaichotlakipudi – Vaarta Teliyuchunden = Idi Aashcharyamu
Ento Santoshamu – Itlu Vyaapimpajeyu – Devuniki Sthotramu || Yeesu ||
Theme
“Yeesu Janminchenu Ilalo” marvels at the profound mystery and sorrow of Jesus’ humble birth in a stable for sinners. And saints for all humanity across time while powerful figures like Caesar, Herod, scribes. And priests tragically failed to recognize their Savior. Through seven poignant stanzas, it contrasts the world’s rejection. With the joyous reality that the Lord came personally for “me and you.”Sacrificing heavenly comfort to become a little child. The refrain shifts from lament (“Idi Aashcharyamu – Ento Vichaaramu”) to triumphant praise. Urging believers to spread this life-changing news everywhere as worship to the Almighty.