Nenellappudu Yehovanu Sannutinchedhan Song Lyrics Telugu
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్
నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ – (2)
అంతా నా మేలుకే – ఆరాధనా యేసుకే
అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే – (2)
అరాధన ఆపను – స్తుతియించుట మానను – (2)
స్తుతియించుట మానను
కన్నీలే పానములైన – కఠిన దుఃఖబాధలైన
స్థితిగతులే మారిన – అవకాశం చేజారిన
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)
మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ – (2)
ఆస్తులన్ని కోల్పొయిన – కన్నవారే కునుమరుగైన
ఊపిరి బరువైన – గుండెలే పగిలినా
యెహోవా యిచ్చెను – యెహోవా తీసికొనెను – (2)
ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక – (2)
అవమానం ఎంతైన – నా వారే కాదన్న
నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2)
నీవు నా కుండగా – ఏది నాకక్కర లేదు – (2)
ఆశలే సమాధియైన – వ్యాధి బాధ వెల్లువైన
అధికారము కొప్పుకొని – రక్షణకై ఆనందింతున్
నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగ ఓ నాధా – (2)
పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్ – (2)
చదువులే రాకున్న – ఓటమి పాలైన
ఉద్యోగం లేకున్న – భూమికే బరువైన
నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు – (2)
నీవుద్దేశించినది నిష్ఫలము కానేరదు – (2)
సంకల్పాన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు
సమస్తము సమకూడి – మేలుకై జరుగును
యేసుని సారూప్యము నేను పొందాలని – (2)
అనుమతించిన ఈ – విలువైన సిలువకై – (2)
నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు
ఇక మీదట నేను – తెలిసికొందును
ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే – (2)
అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే – (2)
Nenellappudu Yehovanu Sannutinchedhan Song Lyrics English
Nenellappudu Yehovanu sannutinchedhan
Nityamu ayana kirti na nota nundun – (2)
Anta na meluke – aaradhana Yesuke
Anta na manchike – tana chittamunaku tala vancite – (2)
Aaradhana apanu – stutiyinchuta mananu – (2)
Stutiyinchuta mananu
Kanneele panamulain – kathina duhkhabadhalain
Sthitigatule marin – avakasam chejarin
Maradu Yesu prema – nityudaina tandri prema – (2)
Maradu Yesu prema – nityudaina tandri prema – (2)
Aastulanani kolpoyina – kannavare kunumarugaina
Upiri baruva – gundele pagilina
Yehova yicchen – Yehova tesikonenu – (2)
Ayana namamunake – stuti kalugu gaka – (2)
Avamanam entain – na vare kada nna
Nivu tappa evarunnaru akasamanduna
Nivu na kundaga – edi nakka kara ledu – (2)
Nivu na kundaga – edi nakka kara ledu – (2)
Aasale samadhiyaina – vyadhi badha velluvaina
Adhikaramu koppukoni – rakshanakai aanandintun
Naadu manassu ni mida – aanukonaga o nadha – (2)
Purnasantini ne pondi ninne ne kirrintun – (2)
Chaduvule rakunna – otami palaina
Udyogam lekunna – bhumike baruva
Na yedala ni talampulu – ento priyamulu – (2)
Nivuddeshinchina nishphalamu kaneradu – (2)
Sankalpana pilupondi – ninne preminchu naku
Samastamu samakoodi – melukai jarugunu
Yesuni sarupyamu nenu pondalani – (2)
Anumatinchina ee – viluvaina siluvakai – (2)
Nivu cheyunadi – nakippudu teliyadu
Ika midata nenu – telisikondunu
Prastutamu samastamu – duhkha karame – (2)
Abhyasinchina niti – samadhana phalame – (2)
Nenellappudu Yehovanu Sannutinchedhan Song Vedio
Nenellappudu Yehovanu Sannutinchedhan” is a beloved Telugu Christian devotional song that calls believers to praise God continually, regardless of life’s circumstances. It emphasizes unwavering faith in Jesus’ eternal love and God’s sovereign plan for good.