Vinarandi Ee Divyabodha Lyrics Telugu
వినరండి ఈ దివ్యబోధ – మేము వేడుకతో యీ బోధ
వినిపింప వచ్చితిమి
|విన||
1. దొరల బోధగాదు దొరతనమిదిగాదు – దేవ దేవునిబోధనండి
పరమ దేవుడు బంపె సుమండి – ఇది నమ్మితే చాలా
మేలండి – ఇది పాపులకు పరమదారండి
||విన||
2. ఎంత వెదకినా ఇంతకంటె మంచిబోధ – ఇలయందు లేదు
సుమండి – తరచి పరిశీలించి చూడరండి – సత్యవేదమును
చదివి చూడండి – ఆత్మ బుద్ధితో నాలోచించండి – ఇది సత్యమని
మీకిప్పుడు సరిగా గోచరమౌను
||విన||
3. ఎంత ఘనులకుగాని ఎంత బీదలకైనా – ఎంతో నవసరము
సుమండి – మాకు అక్కరలేదని చెప్పకండి – ప్రభువు ప్రేమతో
బంపె సుమండి – మీరు వాగ్వాదము చేయకండి – మీరు
దయతో నాలకించి దైవకృప నొందండి
||విన||
4. ఈబోధ నిజమని ఎదలో నమ్మినవారు – పాపశుద్ధినిపొందగలరండి
మారుమనసు మరి పొందగలరు – బూతిమాట రోతగ
నెంచగలరు – పాపముల ఛాయ భయపడగలరు వారు
దైవ ప్రాపుకుచేరి ధన్యులై యుంటారు
||విన||
5. పరము కలిగిన ప్రభువు యేసుక్రీస్తు – మా కప్పగించి
వెళ్ళెనండి – సర్వజనులకు చాటుడనెనండి – నాకు సాక్షులై
యుండుడనెనండి యేసు – పక్షమునె వచ్చి నా మండి – ఇది
క్రీస్తు బోధేగాని మా బోధగాదండి
||విన||
6. ఎంత వెదకిన నీతిమంతుడొక్కడునుగాని – ఇలయందు లేదు
సుమండి – సత్యవేదమే సాక్షి సుమండి – నీతిమంతుడు
క్రీస్తు సుమండి – యేసు నీతి పొందినవారే నీతి మంతులండి
||విన||
7. పరిశుద్ధ దేవుని పరమ పట్టణములో – పామరులు చేరుటెట్లండి
పుణ్యకార్యమువలన కాదండి – నిత్య నరకము తప్పుటెట్లండి
పుణ్యలోకమునకు ప్రభువేదారండి – మీరు యాదారి తప్పితే
యిక దారి లేదండి
||విన||
Vinarandi Ee Divyabodha Lyrics English
Vinarandi ee divyabodha – memu vedukatho yee bodha
Vinipimpa vacchitimi
||Vina||
1. Dhorala bodhagaadhu dhorathanamidhigaadhu – Dheva Dhevunibodhanandi
Parama Dhevudu bampe sumandi – idhi nammithe chaalaa
Melandi – idhi paapulaku paramadhaarandi
||Vina||
2. Entha vedhakinaa inthakante manchibodha – ilayandhu ledu
Sumandi – tharachi parisheelinchi choodarandi – sathyavedhamunu
Chadhivi choodandi – aathma buddhitho naalochinchandi – idhi sathyamani
Meekippudu sarigaa gocharamaunu
||Vina||
3. Entha ghanulakugaani entha bheedhalakainaa – entho navasaramu
Sumandi – maaku akkaraledhani cheppakandi – Prabhuvu prematho
Bampe sumandi – meeru vaagvaadhamu cheyakandi – meeru
Dhayatho naalakinchi dhaivakrupa nondhandhi
||Vina||
4. Eebodha nijamani edhalo namminavaaru – paapashuddhinipondhagalarandhi
Maarumanasu mari pondhagalaru – boothimaata rothaga
Nenchagalaru – paapamula cchaya bhayapadagalaru vaaru
Dhaiva praapukucheri dhanyulai yuntaaru
||Vina||
5. Paramu kaligina Prabhuvu Yesukreesthu – maa kappaginchi
Vellenandhi – sarvajanulaku chaatudanenandhi – naaku saakhulai
Yundudhanenandhi Yesu – pakshamune vacchi naa mandi – idhi
Kreesthu bodhegaani maa bodhagaadhandi
||Vina||
6. Entha vedhakina neethimanthudokkadhunugaani – ilayandhu ledu
Sumandi – sathyavedhame saakshi sumandi – neethimanthudu
Kreesthu sumandi – Yesu neethi pondhinavaare neethi manthulandi
||Vina||
7. Parishuddha Dhevuni parama pattanhamulo – paamarulu cheruthetlandhi
Punhyakaaryamuvalana kaadhandhi – nithya narakamu thapputhetlandhi
Punhyalokamunaku Prabhuvedhaarandhi – meeru yaadhaari thappithe
Yika dhaari ledhandhi
||Vina||