లోకపు మాయకై నే నీడను వెతికాను || Chedirina Gundetho Song Lyrics

By holyspiritmelodies@gmail.com

Published On:

Chedirina Gundetho Song Lyrics

Join WhatsApp

Join Now

Join YouTube

Subscribe Now

Chedirina Gundetho Song Lyrics Telugu

బంధమే తెగిపోవునా… నీతోడే దూరమౌనా..
శోకమే మిగులునా… నీప్రేమే పొందలేనా..
అలసిన ప్రాణమై – సొలసిన జీవమై..
నలిగిన ప్రాయమై – చితికిన హృదయమై..
ఒంటరిగా నిలిచిపోయా… మౌనంగా మిగిలిపోయా..
నే ఒంటరిగా నిలిచిపోయా… నే మౌనంగా మిగిలిపోయా..

“పల్లవి :”

లోకపు మాయకై నే నీడను వెతికాను..
చెదిరిన జీవినై చీకటిలో నడిచాను.. 2
చుక్కాని లేని నావగా – ఫలములే లేని తరువుగా..
జీవమే లేని వెలుగుగా – ఆశలే లేని ప్రాణముగా..
ముళ్లబాటలో నడిచాను… తప్పటడుగులే వేసాను..
నీతిమార్గమే విడిచాను… దోషిగానే మిగిలాను..

“చరణం 1:”

ప్రేమను మరిచాను – లోకముతో కలిశాను..
వ్యర్ధమైన వాటియందే మనసును నిలిపాను..

త్రోవతప్పి తిరిగాను – నీ చేతిని విడిచాను ..
నీకు విరోధముగా నేను ద్రోహము చేసాను..
ఎంచుకున్న మార్గం..పూలబాట వేస్తే..
చేరుకున్న తీరం..ఎండమావి చూపే..
పాపపు ఛాయలతో – లోకపు ఆశలతో..
మలినపు బ్రతుకుతో – చెదిరిన గుండెతో..మిగిలాను..

సరిచేయుమా – సరిదిద్దుమా..
కరుణించుమా – క్షమియించుమా..

నీ దయను నాపై కుమ్మరించుమా..
నీ కృపలో నన్ను ఆదరించుమా..((2))

“చరణం 2:”

కృపనే వెతికాను – కరుణే కోరాను..
నీతిమార్గము నేను వెతికి సన్నిధి చేరాను..

చెరనే విడిచాను – నీ శరణే కోరాను..
భారమైన మనస్సుతో నీ చెంతకు చేరాను..
జీవమైన వాక్యం.. జీవితాన్ని మార్చే..
చేరువైన సత్యం.. భారమును తెంచే..
పగిలిన గుండెతో – విరిగిన మనసుతో..
చితికిన తనువుతో – మారిన బ్రతుకుతో..నిలిచాను ..

మన్నించుమా – నను చేరుమా..
నా దోషమే – హరియించుమా..

నీ ప్రేమే నాపై కురిపించుమా..
నీ వెలుగే నాపై ప్రోక్షించుమా.. ((2))

“చివరి పల్లవి:”
కరములు చాపిన ప్రేమ .. అవధులు చూపని ప్రేమ..
చీకటి చీల్చిన ప్రేమ .. నాకై నిలిచిన ప్రేమ..

దేవా నీ హస్తమే నన్నే కాచెను..
దేవా నీ వాక్కులే నాతోడై నిలిచెను..

నా మనసు మార్చినందుకు స్తోత్రమయా…
నా బ్రతుకు మార్చినందుకు స్తోత్రమయా…

Chedirina Gundetho Song Lyrics Telugu

This is a deeply personal, repentant worship song about falling away, spiritual emptiness, and returning to God’s mercy. The poem moves from lament to honest confession, then to repentance and restoration, ending in praise for God’s transforming grace.

holyspiritmelodies@gmail.com

Latest Gospel Songs is a trusted source for Telugu Christian song lyrics, worship songs, VBS songs, and gospel music content, helping believers grow in faith and worship through the power of music.

🔴Related Post

Leave a Comment