Yesuni Premanu Nemaarakanu Lyrics Telugu
యేసుని ప్రేమను నేమారకను – నెప్పుడు దలఁచవే యో మనసా
వాసిగ నాతని వరనామంబును – వదలక పొగడవె యో మనసా
||యేసుని||
పాపులకొరకై ప్రాణముఁ బెట్టిన ప్రభునిలఁ తలఁచవె యో మనసా
శాపము నంతయుఁ జక్కఁగ నోర్చిన శాంతుని పొగడవె యో మనసా
||యేసుని||
కష్టములలో మన కండగ నుండిన కర్తను తలఁచవె యో మనసా
నష్టములన్నియు నణఁచిన యా గురు శ్రేష్ఠుని పొగడవె యో మనసా
||యేసుని||
మరణతఱిని మన శరణుగ నుండెడు మాన్యునిఁ తలఁచవె యో మనసా
కరుణను మన కన్నీటి దుడిచిన కర్తను పొగడవె యో మనసా
||యేసుని||
ప్రార్థనలు విని ఫలముల నొసఁగిన ప్రభునిఁక తలఁచవె యో మనసా
వర్థనఁ కోరుచు శ్రద్ధతో దిద్దిన వంద్యుని పొగడవె యో మనసా
||యేసుని||
వంచనలేక వరముల నొసఁగిన వరదునిఁ తలఁచవె యో మనసా
కొంచెము కాని కూర్మితో దేవుని కొమరుని పొగడవె యో మనసా
||యేసుని||
Yesuni Premanu Nemaarakanu Lyrics English