Paaparogaaniki Mandu Song Lyrics Telugu
పాపరోగానికి మందు – మీరు పరుగెత్తి
తినకుంటె దొరకదిక ముందు
1. పాపరోగానికి బహు – మంచిదీమందు
నీ పాపముదీయ – నీతి గలదిందు
2. ఎన్ని గుణములకైన వన్నె కెక్కిన మందు
తన్ను సేవించినన్ – తగు సౌఖ్యమొందు
3. దేవుని గానకను దేశాటనము చేయు
బాధ గురువుల కెల్ల – బహుమంచిదీ మందు
4. బొమ్మ పూజలు దైవ – బోధలని యంచును
నమ్ము రోగులకెల్ల – నాణ్యమౌ మందు
5. పాపాంధ కారమున – పడియున్నవారిని
కాపాడి రక్షించు – కరుణగల మందు
6. పసిపిల్లలకు మరియు – పడుచు వారికి నిదియె
ముసలి వారికి సహా ముఖ్య మీమందు
7. ఎప్పుడడిగిన వారి – కప్పుడే దొరుకును
యిప్పుడే దీనిని తప్పక కనుగొనుడి
8. ఊరకనే దొరుకును – ఉర్వి పాపుల కెల్ల
కోరికతో తినరండి – కొదవ లేకుండా
9. నీయందు నాయందు – నిజమైన ప్రేమచే
ఆ మీది దేవుండు – అది పంపే మనకు
10. సిలువపై నీ మందు చిందించబడె ముందు
విలువగల నీయాత్మ – విముక్తి బొందు
11. ఈ మందును మించి ఏ మందు లేదయా
నీ మందు ద్రావిన – నిజమైన శాంతి
12. పరమ వైద్యుడు క్రీస్తు – పాపులే రోగులు
తన రక్తమే మందు – తక్షణమే తినుడి
13. యేసు క్రీస్తుడు నిన్ను – దోష రహితుని జేసి
ఖాయంబుగా మోక్ష – కాంతిలో జేర్చున్
14. కనుక నా రక్షకుని కడు భక్తితో నమ్మి
అనిశంబు నీ హృదయ – మాయనకునిమ్మా
Paaparogaaniki Mandu Song Lyrics English