Emaayenu Emaayenu Song Lyrics Telugu
ఏమాయెను! ఏమాయెను!
అపవాది యత్నాలు ఏమాయెను
1. మొదటితల్లినిజూచి – మోసవాక్యంబులు
వెదజల్లి దైవాజ్ఞ – విడుచునట్లు జేయ
పిదప వచ్చినవారు – పెరుగంగ పాపాలు
ఎదిగి ఎన్నెన్నియో – విధములై వ్వాపింప
వదిలించుటకు దైవ – వ్యక్తియైన యేసు
పధమై రాగ మోక్ష – పథమును తప్పించి
తుదకు పాపములోకి – త్రోయజూచిన దుష్ట =
వధకుడు పన్నిన – వరుస ప్రయత్నాలు || ఏమా ||
2. పరమాత్ముని యాజ్ఞ – పాటింపనందున
మరణంబు కల్గునను – మాట ప్రకారంబు
నరుడు పొందు రెండు – మరణముల్ రానుండె
మరణంబు ముక్తికి – మార్గమైనందున
మరణంబు ఆనంద – కరమైన స్థితియాయె
నరకమను రెండవ – మరణంబు తప్పింప
మరణ మొందను సిద్ధ – మైయున్న రక్షకుని
= మరణింప జేసిన – మానవుల యత్నాలు || ఏమా ||
3. తలమీదను హస్త – ములయందును పాద
ముల యందును పార్శ్వ – ముల యందును రక్త
= ములు గారిన గాయ – ములును వేదనబాధ
|| ఏమా ||
4. రాతిగోడలు నాలుగు – ప్రక్కలందుడగను
మూతగ బండయు – ముద్రయు వేయగను
దూతవచ్చి రాయి – దొర్లించినప్పుడు
= మా తండ్రి క్రీస్తు స – మాధి యావత్తును || ఏమా ||
5. చావనై యున్నను – లేవనై యున్నట్లు
ఆ వంచకుడు చెప్పె – జీవించియున్నప్పుడు
కావున శిష్యుల – క్కడి శవము నెత్తికొని
పోవుదురప్పుడు – మొదటి వంచనకంటె
ఈ వంచనయె చెడ్డ – దై వెల్లడగునని
ఈ విధముగ చెప్పి – ఈర్ష్యపరులు రాత్రి
కావలిపెట్టిన – ఘాటు జాగ్రత్తలు || ఏమా ||
Emaayenu! Emaayenu!
Apavaadi yatnalu emaayenu
1. Modatitallini juuchi – mosavaakyambulu
Vedajalli daivaajna – viduchunatlu jeya
Pidapa vachchinaaru – peruganga paapalu
Edigi ennenniyo – vidhamulai vvaapinpa
Vadinchutaku daiva – vyaktiaiyina yesu
Padhamai raaga moksha – pathamunu tappinchi
Tudaku paapamuloki – troyajuuchina dushta =
Vadakudu pannina – varusa prayatnalu || Emaa ||
2. Paramaatmuni yaagna – paatinpananduna
Maranambu kalgunanu – maata prakaarambu
Narudu pondhu rendu – maranamul raanunde
Maranambu mukthiki – maargamainanduna
Maranambu aananda – karamaina sthitiyaaye
Narakamanu renduva – maranambu tappinpa
Marana mondanu sidha – maiyunna rakshakuni
= Maraninpa jesina – maanavaala yatnalu || Emaa ||
3. Talameedanu hasta – mulayandunu paada
Mula yandunu paarshva – mula yandunu raktha
= Mulugaarina gaaya – mulunu vedanabaadha
|| Emaa ||
4. Raati godalu naalugu – prakkalandudaganu
Mootaga bandayu – mudrayu veyaganu
Dootavacchi raayi – dorlinchina ppudu
= Maa tandri kriistu sa – maadhi yaavattunu || Emaa ||
5. Chaavanai yunnaanu – levanai yunna tl u
Aa vachakudu cheppe – jeevinchiyunnappudu
Kaavuna shishyula – kkadi shavamu nettikoni
Povudorappudu – modati vachanaka nte
Ee vachanaye chedda – daivelladagunani
Ee vidhamuga cheppi – eer shyaparulu raatri
Kaavalipettina – ghaatu jaagratthalu || Emaa ||
Emaayenu Emaayenu Song Vedio
Theme
Emaayenu! Emaayenu! Apavaadi Lyrics is the victory of Jesus Christ over sin, death, and the devil’s schemes. It also presented through an Easter‑focused, devotional lens. The song Emaayenu! Emaayenu! Apavaadi Lyrics moves from humanity’s fall in Adam and Eve’s disobedience, where the enemy’s lies turned people away from God’s command. To the spread of sin and guilt over generations.
It then highlights how Jesus, the divine Savior willingly took upon Himself the suffering of the cross. Like bearing wounds, blood, and agony so that believers could be freed from eternal condemnation.