తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా || Thalli Premakanna Thandri Premakanna Lyrics

WhatsApp Group Join Now

Thalli Premakanna Thandri Premakanna Lyrics Telugu

తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా
ఉన్నతమైనది యేసుని ప్రేమ
యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ [2]

1.తల్లి వొడిలో వొదిగియున్నప్పుడు – వాక్యమనే పాలతో పెంచిన దేవా
ముళ్ళ పొదలో చిక్కియున్నప్పుడు – వెదకి రక్షించి కాపాడిన తండ్రి
నీ ప్రేమకు హద్దులెవరు వేయగలరు యేసయ్య
వేవేల నోళ్లతో కొనియాడెదనయ్య

2.ఏ మంచిలేని నన్ను మిన్నగ ప్రేమించి- నీ సిలువ రక్తముతో కొంటివి దేవా
లోక ప్రేమలాన్ని నీటిమూటలవగా – శాశ్వత ప్రేమతో పెంచిన దేవా
నీ ప్రేమను నేనెలా వర్ణింతునయ్యా
ఏమిచ్చి నీ ఋణం నే తీర్చేదనయ్య

Thalli Premakanna Thandri Premakanna Lyrics English

Talli prema kanna tandri prema kanna
Unnatamaina yesuni prema
Yesuni prema na yesuni prema

Talli vodilo vodigiyunna ppudu – Vakyamane palato penchina deva
Mullapodalalo chikkiyunna ppudu – Vedaki rakshinci kapadina tandri
Ni prema ku haddul evaru veyagalaru yesayya
Veveyela nol lata koniyadedanayya

Ye manchi leni nannu minnaga preminchi – Ni siluva raktamuto kontivi deva
Loka prema lanni netimutalavagaa – Sashvata prema to penchina deva
Ni premanu nenehala varnintunaya
Emichi ni runam ne tirchedanayya

This is a popular Telugu Christian devotional hymn titled something like “Talli Prema Kanna Tandri Prema Kanna” (Greater Than Mother’s Love, Greater Than Father’s Love). It praises Jesus’ supreme, unconditional love as higher than parental affection, using vivid imagery from the Bible.

Leave a Comment