రాజులకు రాజైన Rajulaku raajaina Song Lyrics

WhatsApp Group Join Now

Rajulaku raajaina Telugu Lyrics

 రాజులకు రాజైన
యీ మన విభుని పూజ చేయుటకు రండి
ఈ జయశాలి కన్నా
మనకింకా రాజెవ్వరును లేరని
రాజులకు రాజైన…

1. కరుణ గల సోదరుండై
యీయన ధరణికే తెంచెనయ్యా (2)
స్థిరముగా నమ్ముకొనిన
మనకొసగు పరలోక రాజ్యమును
రాజులకు రాజైన…

2. నక్కలకు బొరియలుండే
నాకాశ పక్షులకు గూళ్లుండెను (2)
ఒక్కింత స్థలమైనను
మన విభుని కెక్కడ లేకుండెను
రాజులకు రాజైన…

3. త్వరపడి రండి రండి
ఈ పరమ గురుని యొద్దకు మీరలు (2)
దరికి జేరిన వారిని
ఈ ప్రభువు తరుమడెన్నడు దూరము
రాజులకు రాజైన…

4. అపహాసములు సేయుచు
నాయన యాననము పై ఉమియుచు
కృప మాలిన సైనికులందరును
నెపములెంచుచు గొట్టిరి
రాజులకు రాజైన…

5. కరమునందొక్క రెల్లు పుడకను
దిరముగా నునిచి వారల్
“ధరణీపతి శ్రేష్ఠుడా
నీకిపుడు దండమనుచు మొక్కిరి”
రాజులకు రాజైన…

6. ఇట్టి శ్రమలను బొందిన
రక్షకుని పట్టుదలతో నమ్మిన
అట్టహాసముతోడను
పరలోక పట్టణంబున జేర్చును
రాజులకు రాజైన…

7. శక్తిగల రక్షకుండై
మన కొరకు ముక్తి సిద్ధము చేసెను
భక్తితో బ్రార్థించిన
మనకొసగు రక్తితో నా ముక్తిని
రాజులకు రాజైన…

Rajulaku raajaina English lyrics

Rajulaku raajaina
Yee mana vibhuni pooja cheyutaku randi
Ee jayashaali kannaa
Manakinka raajevvarunu leenati
Rajulaku raajaina…

1. Karuna galla sodharundai
Yee yanna dharanike tenchenayyaa (2)
Sthiramuga nam’mukonina
Manakosagu paraloka raajyamunu
Rajulaku raajaina…

2. Nakkala ku boriyalunde
Naakaasha pakshulaku goollunde (2)
Okkinta sthalamaina nu
Mana vibhuni kekkaḍa lekundenu
Rajulaku raajaina…

3.Tvarapadi randi randi
Ee parama guruni yoddaku meerlu (2)
Dariki jerina vaarini
Ee prabhuvu tharumadennaḍu dooramu
Rajulaku raajaina…

4. Apahaasamulu seyu chu
Naayana yaanana mu pai umiyu chu
Krupa maalina sainikulandarunu
Nepamulen chu gotti ri
Rajulaku raajaina…

5. Karamunandokku rellu pudakanu
Dhiramuga nunichi vaaral
“Dharaneepati shreshtuda
Neekipudu dandamunuchu mokkiri”
Rajulaku raajaina…

6. Itti shramalanu bondina
Rakshakuni pattudhalatho nam’mina
Attahaasamuthoḍanu
Paraloka patṭanambuna jerchunu
Rajulaku raajaina…

7. Shakthigala rakshakundai
Mana koraku mukthi siddhamu chesen u
Bhakthitho braarthinchina
Manakosagu rakthitho naa mukthini
Rajulaku raajaina…

 

Leave a Comment