Aananada Bharituda Song Lyrics Telugu
ఆనందభరితుడా – ఆద్యంతరహితుడా
అందు కొనుము ఆనందముతో – పొందుగ మేమందరము
అందింతు వందనం
||ఆన||
1. యేసయ్య నీదు మహిమ – ఎంతని వర్ణింతుము
వెలసె మందిర మిచ్చట ఏడు వత్సరములలో
మరువలేము మనస్సులోన నీదు పరమ మర్మములెల్ల
మధ్యనుండుమా ప్రభో
||ఆన||
2. సర్వలోక సృష్టికర్త – సన్నిధిని స్థాపించి
సకల కార్యములను నీవే సాధించుచుంటివి
సహకారమే మా సన్నిధియై – ఉపకారమే మా ఉన్నత నిధియై
ఊరింది ఊటగా
||ఆన||
3. అడుగువారికి చ్చే దనంచు – ఆనతి చ్చిన తండ్రి
అడగకయే లెక్కించి – అందమైన ఆలయమున్
నిర్మించిన నిర్మలరూపా – నిను పొగడగ మేమేపాటి
నీకేమా వందనమ్
||ఆన||
4. చకచక పనులు సాధించి – సమూయేలుగారికి
జతపరచి నావు తండ్రి చక్కని సతినిలలో
సాకుము సతీపతులను – నీవే సారథివై సర్వమునందు
సత్యదేవ వందనమ్
||ఆన||
5. ప్రకాశింప పంజరమందు – ప్రవేశింప నందరిని
పంపితివి నీ ప్రియ సంఘవు ప్రెసిడెంటుగారిని
పరవశించె పంజరమందు ప్రభువునందు పాదములిడిరి
పాలించు మమ్ములన్
||ఆన||
6. నాల్గు దిక్కులో యనుగ – నలుగురు సేవకులతో
నడిపించు చుంటివి నీదు నాణ్యపు సంఘమున్
ఏరినావు కోరికతోడ – ఎనలేని బైబిలు మిషనున్
ఏకదేవ వందనమ్
||ఆన||
7. బంధించి మమ్ముందరిని – బాసిపోయే నాయకుడు
బాసిపోయే నంతలోనే మాసిపోదు నీ సంఘం నాడు
నాటినట్టి వారు – నిలచింది నీవై నేడు
నిత్యదేవ వందనమ్
||ఆన||
Aananada Bharituda – Aadyantara Hituda
Andu Konumu Aananadamuto – Ponduga Memandaramu
Andintu Vandanam
||Aana||
1. Yesayya Needu Mahima – Entani Varnintumu
Velesa Mandira Michchata Edulu Vatsaramulalo
Maruvale Mu Manassulona Needu Parama Marmamulella
Madhyanunduma Prabho
||Aana||
2. Sarvaloka Srushthikarta – Sannidhini Sthapinchi
Sakala Karyamulanu Neve Sadhinchuchuntivi
Sahakaramaye Ma Sannidhiyai – Upakaramaye Ma Unnata Nidhiyai
Uurindi Uutaga
||Aana||
3. Aduguvariki Chche Danamchu – Aanati Chchina Tandri
Adagakaye Lekkinchi – Andamaina Alayamunu
Nirminchina Nirmalarupa – Ninu Pogadaga Memepati
Nekema Vandanam
||Aana||
4. Chakachaka Panulu Sadhinchi – Samuyelugariki
Jataparachi Navu Tandri Chakkani Satinilalo
Sakumu Satipatulunu – Neve Sarathivai Sarvmunandu
Satya Deva Vandanam
||Aana||
5. Prakashinpa Panjaramandu – Praveshinpa Nandarin i
Pampitivi Ni Priya Sanghavu Presidentugarini
Paravashinche Panjaramandu Prabhu vandanu Padamulidiri
Palinchu Mammulan
||Aana||
6. Nalgu Dikku loyanaga – Nalugu ru Sevakulat o
Nadipinchu Chuntivi Needu Nanyapu Sanghamunu
Eerinavu Korikatoda – Enaleni Baibhilu Mishanunu
Eka Deva Vandanam
||Aana||
7. Bandhinchi Mammumndarini – Basipoye Nayakudu
Basipoye Nantalone Masipodu Ni Sangha Nadu
Natinatti Vari – Nilachindi Neva i Nedu
Nitya Deva Vandanam
||Aana||