పరవాసిని నే జగమున ప్రభువా || Paravaasini Ne Jagamuna Prabhuvaa Lyrics

WhatsApp Group Join Now

Paravaasini Ne Jagamuna Prabhuvaa Lyrics Telugu

పరవాసిని నే జగమున ప్రభువా (2)
నడచుచున్నాను నీ దారిన్
నా గురి నీవే నా ప్రభువా (2)
నీ దరినే జేరెదను
నేను.. నీ దరినే జేరెదను

||పరవాసిని||

లోకమంతా నాదని యెంచి
బంధు మిత్రులే ప్రియులనుకొంటిని (2)
అంతయు మోసమేగా (2)
వ్యర్ధము సర్వమును
ఇలలో.. వ్యర్ధము సర్వమును

||పరవాసిని||

ధన సంపదలు గౌరవములు
దహించిపోవు నీలోకమున (2)
పాపము నిండె జగములో (2)
శాపము చేకూర్చుకొనే
లోకము.. శాపము చేకూర్చుకొనే

||పరవాసిని||

తెలుపుము నా అంతము నాకు
తెలుపుము నా ఆయువు యెంతో (2)
తెలుపుము ఎంత అల్పుడనో (2)
విరిగి నలిగియున్నాను
నేను.. విరిగి నలిగియున్నాను

||పరవాసిని||

ఆ దినము ప్రభు గుర్తెరిగితిని
నీ రక్తముచే మార్చబడితిని (2)
క్షమాపణ పొందితివనగా (2)
మహానందము కలిగే
నాలో.. మహానందము కలిగే

||పరవాసిని||

యాత్రికుడనై ఈ లోకములో
సిలువ మోయుచు సాగెదనిలలో (2)
అమూల్యమైన ధనముగా (2)
పొందితిని నేను
యేసునే.. పొందితిని నేను

||పరవాసిని||

నా నేత్రములు మూయబడగా
నాదు యాత్ర ముగియునిలలో (2)
చేరుదున్ పరలోక దేశము (2)
నాదు గానము ఇదియే
నిత్యము.. నాదు గానము ఇదియే

||పరవాసిని||

 

Paravaasini Ne Jagamuna Prabhuvaa Lyrics English

Paravaasini ne jagamuna prabhuvaa (2)
Nadachuchunnanu nee daarini
Na guri neeve na prabhuvaa (2)
Nee darine jeredanu
Nenu.. nee darine jeredanu

|| Paravaasini ||

Lokamantaa naadani yenc hi
Bandhu mithrule priyulanukontini (2)
Antayu mosamega (2)
Vyarthamu sarvamunu
Ilalo.. vyarthamu sarvamunu

|| Paravaasini ||

Dhana sampadalu gouravamulu
Dahincipovu neelokamuna (2)
Paapamu nindey jagamulo (2)
Shaapamu chekoorchukoney
Lokamu.. shaapamu chekoorchukoney

|| Paravaasini ||

Telupumu naa anthamu naaku
Telupumu naa aayuvu yentho (2)
Telupumu yentha alupudano (2)
Virigi naligiyunnanu
Nenu.. virigi naligiyunnanu

|| Paravaasini ||

Aa dinam u prabhu gurterigitini
Nee raktamuche maarchabaditini (2)
Kshamaapana pondhitivanegaa (2)
Mahaanandamu kaligey
Naalo.. mahaanandamu kaligey

|| Paravaasini ||

Yaathrikudana i neelokamulo
Siluva mo yuc hu sa gedanilalo (2)
Amoolyamaina dhanamuga (2)
Pondhitini nenu
Yesuney.. pondhitini nenu

|| Paravaasini ||

Na netramulu mooyabadagaa
Naadu yaathra mugiyunilalo (2)
Cherudun paraloka deshamu (2)
Naadu gaanamu idhiye
Nithyamu.. naadu gaanamu idhiye

|| Paravaasini ||

Leave a Comment