Naa Korika Nee Pranalika Lyrics Telugu
నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని
నా ప్రార్థన విజ్ఞాపనా నిత్య మహిమలో నిలవాలని
అక్షయుడా నీ కలువరి త్యాగం
అంకితభావం కలుగ జేసేను
ఆశల వాకిలి తెరచినావు –
అనురాగ వర్షం కురిపించినావు
నా హృదయములో ఉప్పొంగేనే –
కృతజ్ఞతా సంద్రమే
నీ సన్నిధిలో స్తుతి పాడనా –
నా హృదయ విద్వాంసుడా*
1.యదార్ధ వంతుల యెడల –
నీవుయెడబాయాక కృప చూపి
గాఢాందకారము కమ్ముకొనగా
వెలుగు రేఖవై ఉదయించినావు
నన్ను నీవు నడిపించి నావు –
ఇష్టుడనై నేనడచినందున
దీర్ఘాయువుతో తృప్తిపరిచిన –
సజీవుడవు నీవెనయ్యా
|| నా హృదయములో ||
2.నాలో ఉన్నది విశ్వాస వరము –
తోడై యున్నది వాగ్దాన బలము
ధైర్య పరచి నడుపుచున్నది
విజయసిఖరపు దిశగా
ఆర్పజాలని నీ ప్రేమతో –
ఆత్మ దీపము వెలిగించినావు
దీనమనస్సు వినయభావము
నాకు నేర్పిన సాత్వీకుడా
|| నా హృదయములో ||
3.స్వఛ్చమైనది నీవాక్యం – వన్నెతరగని ఉపదేశం
మహిమగలిగిన సంఘముగా నను
నిలుపునే నీ యెదుట
సిగ్గు పరచదు ననెన్నడూ నీలో నాకున్న నిరీక్షణ
వేచియున్నాను నీ కోసమే
సిద్ధపరచుము సంపూర్ణుడా
|| నా హృదయములో ||
Naa Korika Nee Pranalika Lyrics English
Na Korika Ni Pranalika Parimalinchalani
Na prarthana vijnapana nitya mahimalo nilavalani
Aksayuda ni kaluvari tyagam
Ankitabhavam kaluga jesenu
Ashala vakili terachinavu –
Anuraga varsham kuripinchinavu
Na hrudayamulo uppongene –
Krtagnata sandrame
Ni sannidhilo stuti padana –
Na hrdaya vidvansuda*
1. Yadardha vantula yedala –
Ni vu yedabayaka krupa cupi
Gadhandakaramu kammukonaga
Velugu rekhava i udayinchinau
Nannu ni vu nadipinci navu –
Istudanai nenadachin dun
Dirghayuvuto truptiparicina –
Sajivudavu nivenayya
|| Na hrudayamulo ||
2. Nalo unnadi visvasa varamu –
Toda i yunnadi vagdana balamu
Dhairya paraci nadupucunnadi
Vijayasikharapu disaga
Arpajalan i ni premat o –
Atma dipamu veliginchinau
Dinamanasu vinayabhavamu
Naku nerpina satvikuda
|| Na hrudayamulo ||
3. Svachchainadi ni vakyam – vanna taragani upadesamu
Mahimagaligina sanghamuga nannu
Nilupune ni yeduta
Siggu paracadu nanennadu nilo nakunna nirikshana
Veciyunnanu ni kosame
Siddhaparacumu sampurnada
|| Na hrudayamulo ||