నీకేగా నా స్తుతి మాలిక || Neekega Naa Stuthi Maalika Lyrics

WhatsApp Group Join Now

Neekega Naa Stuthi Maalika Lyrics Telugu

నీకేగా నా స్తుతి మాలిక – నీ కొరకే ఈ ఘన వేదిక
నీ ప్రేమ నాపై చల్లారిపోదు
మరనానికైనా వెనుతిరుగ లేదు
మనలేను నే నిన్ను చూడక
మహా ఘనుడా నా యేసయ్యా

సంతోష గానాల స్తోత్ర సంపద
నీకే చెల్లింతును ఎల్ల వేళలా
అనురాగ శీలుడా అనుగ్రహ పూర్ణుడా
నీ గుణశీలత వర్ణింపతరమా
నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా
నీవు లేని లోకాన నేనుండలేనయ్యా
నా ప్రాణం నా ధ్యానం నీవెనయ్యా

నీతో సమమైన బలమైన వారెవ్వరూ
లేరే జగమందు నే ఎందు వెదకినను
నీతి భాస్కరుడా నీ నీతి కిరణం
ఈ లోకమంతా ఏలుచున్నది గా
నా మది లోన మహా రాజు నీవేనయ్యా
ఇహపరమందు నన్నేలు తేజోమయా
నీ నామం-కీర్తించి-ఆరాధింతును…

నీతో నిలుచుండు ఈ భాగ్యమే చాలు
వేరే ఆశేమియు లేదు నాకిలలో
నా ప్రాణ ప్రియుడా నన్నేలు దైవమా
ఆపాద మస్తకం నీకేగా అంకితం
నా శ్వాస నిస్వాసయు నీవెనయ్యా
నా జీవిత ఆద్యంతమూ నీవేనయా
నీ కొరకే-నేనిలలో-జీవింతును

Neekega Naa Stuthi Maalika Lyrics English

Nee kega na sthuthi malika, nee korake ee ghana vedika
Nee prema na pai challaripodu
Maranaanikaina venutiruga ledu
Manale nu ne ninnu chudaka
Maha ghanuda na Yesayya

Santhosha ganaala sthothra sampada
Nee ke chellintunu ella velala
Anuraaga sheeluda anugraha poornuda
Nee guna sheelatha varnimpatarama
Na prema prapanchamu neevenayya
Neevu leni lokana naanundalenu
Na praanam na dhyaanam neevenayya

Nee tho samamaina balamaina vaarevvru
Lere jagamandu ne endu vedakinanu
Nee thi bhaaskrudaa nee nithi kiranam
Ee lokamantaa aeluchunnadi ga
Na madhi lonamaha raaju neevenayya
Ihaparamandu nannelu thaejomaaya
Nee naamam keerthinch i aaradhintunu

Nee tho niluchundu ee bhaagyame chaalu
Vere aashemiyu ledu naakilalo
Na praana priyuda nannelu daivama
Aapaada masthakam nee kega ankitham
Na shwaasa niswaasayu neevenayya
Na jeevitha aadyaantamu neevenaya
Nee korake neenilalo jeevintunu

Leave a Comment