Mahima Lokambunaku Mallinavaa Lyrics Telugu
మహిమ లోకంబునకు – మళ్ళినావా మహిలో నను బెట్టి ప్రభూ
ఇహమందు పరవాసి నై యింటికెడముగ విహరించుచుందు
నా విహితులెవరన శ్రమలే
|| మహిమ ||
ఎన్నళ్ళుండగ వలె నింటికి దూరముగ – కన్ను చూడదు నిన్ను
గాని ప్రార్ధన జూచున్ = పన్నుగ నిట్టూర్పు పరలోకమున జొచ్చి
నిన్ను జేరుచు నుండు నేను వచ్చు వరకు
|| మహిమ ||
అప్పుడా పరమార్థ మనుభవించుచు నుందు – నెప్పుడు మనమికను
నెడబాయ కుందుము = ఇప్పుడమి వేదనలిక నుండ నేరవు
అప్పురిన్ భక్తులతో ఆనంద ముగ నుందు
|| మహిమ ||
అచ్చట రాత్రియు హానియు నుండదు – ఎచ్చట ధనమో యట
హృదయంబు నుండును = విచ్చలవిడిగా నా విజయ రక్షకునితో
ముచ్చట లాడుచు మురియుచు నుందును
|| మహిమ ||
ఏ రీతిన్ వెళ్ళితివో – ఆ రీతిన్ వచ్చెదవు
ఏ రోజున వచ్చెదవో యెరుగనె యెరుగను = ఊరకుండక వేడుచు
నూరుకొని యుందును నీ రాక కోసమై – నిత్యంబు జూతును
|| మహిమ ||
ఈవు వచ్చునప్పుడిట్లుండ గల్గెడి – పావన మానవుడు భాగ్యవంతుడౌను
నీ వాగ్ధానము బట్టి నీ తండ్రి యింటను
చావు లేని స్థితి శాశ్వత మహిమ యతనిదే
|| మహిమ ||
Mahima Lokambunaku Mallinavaa Lyrics English
Mahima Lokambunaku – Mallinavaa Mahilona Nannu Betti Prabhu
Ihamandhu Paravaasi Naiyintikedamuga Viharincchundhu
Naa Vihitulevarana Shramale
|| Mahima ||
Ennalundagavale – Nintiki Dhooramuga Kanna Choodadhu Nin nu
Gaani Praarthana Joocchunu = Pannuga Nitt oorpu Paralaokamuna Jochchi
Ninnu Jeruch u Nundu Nenu Vachchu Varaku
|| Mahima ||
Appudaa Paramaartha Manubhavincchuch u Nundu – Neppudu Manamikana
Nedabaayakundumu = Ippudami Vedanalika Nunda Neravu
Appurina Bhakthulatho Aananda Muganundu
|| Mahima ||
Achchatha Rathriyu Haaniyu Nundhadhu – Echchatha Dhanamoya Yat
Hrudhayambu Nundunu = Vichchalavidigaa Naa Vijaya Rakshakunit ho
Muchatha Laaduch u Muriyuch u Nundunu
|| Mahima ||
Ee Reethina Vellitheevo – Aa Reethina Vachchedavu
Ee Rojuna Vachchedavo Yerugan e Yeruganu = Oorakundaka Veduchu
Noorukoni Yundunu Nee Raaka Kosamai – Nityambu Jootunu
|| Mahima ||
Eevu Vachchunappudithlunda Galgedhi – Paavana Maanavudu Bhaghyavanthudoanu
Nee Vaaghdhaanamu Batti Nee Thandhri Yintanu
Chaavu Len i Sthithi Shaashwatha Mahima Yathanidhe
|| Mahima ||