Jaya Mangalam Mahotsava Lyrics Telugu
జయ మంగళమ్ – మహో – త్సవ మంగళమ్ – పెండ్లి – నయ పూరితము – జీవ – నము నిరతము
|| జయ ||
1. ఆది దంపతులైన – యాదాము – హవ్వలు యాది ప్రేమాదులను – ననుసరించి
యే దివసమందును – నేక దేహాత్ములై – పాదు కొను జీవితము – పాలించిన
|| జయ ||
2. అబ్రహాము శార – యనురాగ ఘననీయు – లై బ్రదికి వాగ్ద – త్తాళి బొంది,
హెబ్రీయ వంశాది – హిత దంపత వరులై – హెబ్రోనులో నున్న = ట్లే యుండిన
|| జయ ||
3. ఈసాకు రిబెకయను – నీ యిరువురి పవిత్ర – మౌ సాదృశ్య జీవ
నౌన్నత్యము = కోసంబు ప్రార్ధించు – కొని మాదిరిగా నుండ – భాసు రాశీస్సును – బడయు నేని
|| జయ ||
4. యాకోబు మనసులో – ననుకొనిన లేయాను – శ్రీకరుండు యెహోవ – స్థిరము చేసి
లోక సంపదలు బర – లోక సౌభాగ్యములు – నేకముగ భువి నిడినట్లు – లిచ్చునేని
|| జయ ||
5. జకరియ ఎలీజబెతు – జంటగా దేవుని – సకలాజ్ఞలలో సదా – చార ములలో
నకళంకునగుచు నీ – త్యాత్ములై బ్రతికిన – ప్రకటితంబగు బ్రతుకు – ప్రాప్తించిన
|| జయ ||
6. కానా వధూవరులు కడు – నద్భుత కరుని – దానాద్భుతము సన్ని – ధానంబు
ధ్యానాంశముగ జీవి – తమున పొందిన రీతి – గానే వీరును బొంద – గలిగిన మహా
|| జయ ||
7. శుభకరముగ వీరు – శోభిల్లు నట్లుగా – అభయ హస్తంబిచ్చి – హర్షమొసగి
ఉభయులు నేకమై – ఉండునట్లుగ జేసి – సభయందు – స్థిరముగ స్థాపించుమీ
|| జయ ||
8. శోభిల్లు క్రైస్తవ – సూత్ర జీవితమెల్ల – శోభిల్లు శారీర – సుఖజీవము
శోభిల్లు మాదిరి – చూపెడి జీవము – శోభిల్లు సేవ సం – స్తుతుల తోడ
|| జయ ||
9. షారోను ప్రార్ధన – శాలలో గూడిన – వారలందరకును – వచ్చు మహిమ
రారాజు పెండ్లి – కుమారుని రాకడ – ధారిత్రి యంతట జేరుగాక
|| జయ ||
10. పెండ్లి కొడుకైన మన – ప్రియ ప్రభువు యేసును – బెండ్లి కూతురైన – ప్రియ సభను
గండ్లతో మోక్షమున – గాంచి కలియు వరకు – బెండ్లి దంపతుల కుం – భ్రీతియున్న
|| జయ ||
11. ఈ వివాహ కార్య – మిది వరకునైన భ – క్తావళి పెండ్లిండ్ల యందుజేర
పావన గృహముల లో – పల వీరి గృహమొక – టై వెలుగ గృప యున్న – ట్లైన గొప్ప
|| జయ ||
12. జనక కుమారాత్మలను త్రైక దేవుడు – ఘనత నొందు చుండుగాక వీరి
అనుదిన జీవిత మాయన సన్నిధి – వినయ పూరితమై – వెలయు గాక
|| జయ ||