Nee Sannidhi Nilupu Naalo Lyrics Telugu
నీ సన్నిధి నిలుపు – నాలో నీ సన్నిధి నిలుపు
నీ ఆజ్ఞలన్నియు అనుసరించు అత్మను నాకిమ్మయ్యా
||నీ||
1. విశ్వాస నేత్రములు – వీక్షించుచున్నవి నిన్ను
వున్నది వున్నట్లు చూచి – సన్నుతించునట్లు
||నీ||
2. దీనులను హెచ్చించి – అనాధలను దీవించి
దీన హృదయ నాదములు విన వీనులనొగ్గుము దేవా
||నీ||
3. ఆపదలే యేవేళ నన్నావరించుచుండ – నీ సన్నిధి
నా దాగు చోటని – ఆతుర పడుచునుండు
||నీ||
4. మానవ జన్మమె చిత్రం – నీ కార్యములే విచిత్రం
నీ జీవమును నా జీవమునకై – దారబోసిన దేవా
||నీ||
5. నీ రొమ్మున ఆనుకొనుటే – నాకున్నవి మరచి చనుట
వెనుకున్న వాటిని లక్ష్యపెట్టక ముందునకు నడిపించు
||నీ||
6. రాకడ ద్వనులే భువిలో – ఎటు చూచిన వినబడుచుండు
నన్ను నా జనాంగములను సిద్ధపరచుము దేవా
||నీ||
7. లోకములో నేనుంటి – బలహీనపు ఘటమై యుంటి
నన్ను నేనే నమ్మనట్టి – దేహములో నేనుంటి
||నీ||
8. నీ ఆజ్ఞలను పాటించి – బైబిలు మిషనును స్థాపించి
బైబిలు మర్మములన్ని – మాకు విపులముగా బోధించు
యం. దేవదాసు అయ్యను మాకు బహుమతిగా నిచ్చితివి
||నీ||
9. వృద్దాప్యములో తానుండి – మా బాధలలో పాలొంది
మా దుఃఖములను ఓదార్చి నీ సన్నిధి నేర్పిచి – మా తండ్రి
ఆత్మను మాతో నుంచి మము నడిపించుము దేవా
||నీ||
Nee Sannidhi Nilupu Naalo Lyrics English
Nee sannidhi nilupu – naalo nee sannidhi nilupu
Nee aajnaalanneyu anusarincu aatmanu naakimmayya
||Nee||
Viswaasa netramulu – veekshinchuchunnaavi ninu
Unnadi unnattlu chuchi – sannuthinchatl
||Nee||
Deenulanu hecchinci – anaadhalanu deevincchi
Deena hrudaya naadamulu vina veenulano ggumu deva
||Nee||
Aapadalae yevaela nannaavarinchuchunda – nee sannidhi
Naa daagu chotani – aatura paduchunandu
||Nee||
Maanava janmame chitramu – nee kaaryamulae vichitramu
Nee jeevamunu naa jeevamunakai – daarabosina deva
||Nee||
Nee rommun aanukonute – naakunnaavi marachi chanuta
Vena kukunna vaatini lakshyapettaka mundunaku nadipincchu
||Nee||
Raakada dwanulae bhuvilo – etu chuchina vinabaduchundu
Nannu naa janaangamulanu siddhaparachumu deva
||Nee||
Lokamulo naenunti – balheenapu ghatamai yunti
Nannu naene nammanatti – dehamulo naenunti
||Nee||
Nee aajnalanu paatinchi – baibilu missionunu sthaapincchi
Baibilu marmamulanni – maaku vipulamuga bodhincchu
Y.M. Devadasu ayyannu maaku bahumathiga nicchitivi
||Nee||
Vruddhaapyamulo taanund i – maa baadhalalo paalondi
Maa duhkhamulanu odaar cchi nee sannidhi neerpicchi – maa tandri
Aatmanu maato nuncchi mamu nadipincchumu deva
||Nee||