Kalugajeyaledu Ghana Devundaina Lyrics Telugu
కలుగ జేయలేదు – ఘన దేవుండైన తండ్రి
కళ లేనట్టివి – మన కన్నుల కందగ నట్టివి
= మలిన పదార్థంబులు – చేతుల కంట రానట్టివి
బలహీనములైనట్టివి – దుష్ఫలములు, దుర్భుద్దులు
|| కలుగ ||
1. దేవుండు లేడనుట – యే వస్తువునైన మ్రొక్కుట
దేవుని దూషించుట – సద్భావము లేకుండుట
= దేవుని గూర్చి యపార్థము – ధిక్కరించి మెలగుట
సేవలు పూజలు మానుట – యీవిధంబు దుర్భుద్దులు
|| కలుగ ||
2. గౌరవింపక పెద్దవారిని – ఎదిరించుట చేరి పరుల తిట్టుట
పేదవారి చంపి – చంపుకొనుట ఊరకనె సోమరిగ
= గూరుచుండుట త్రాగుట – పేరాశ నిరాశ యసూయ
కృరత్వంబు నశుభ్రత
|| కలుగ ||
3. బిడియము చెందుట – మోహముపడి వ్యభిచారము
ద్రోహముబడి కొట్టుకొనుట – స్వలాభము కొరకై పాటుపడుట
= గుడి గోపురము నైనను – తడివి కొని దొంగిలించుట
చెడి జూద మాడుటయు – పైబడి లంచాలు కొనుట
|| కలుగ ||
4. పరుల పేరు చెడగొట్టుట – మరి చాడీలు చెప్పుట
కరుణలేక నన్యాయము – దొరలించి యసత్యమాడుట
= చిరునవ్వుతో ముఖ స్తుతి – చేయుట త్వరపడి యనుమానించుట
వెరువక నబద్ధ సాక్ష్యము – కోర కలిగెడి దుర్భుద్దులు
|| కలుగ ||
5. కృతజ్ఞత లేనిస్థితి – మతిలేని తనంబు మరుపు
మత వాదములు అజ్ఞానము – అతి సౌఖ్యంబు గర్వంబును
= స్తుతి చేయ మాని వేయుట – మృతి విశ్వాసము కలుగుట
ప్రతివిషయంబున అనాగరిత గలిగిన దుర్భుద్దులు
|| కలుగ ||
6. పాప ఫలితములైన శాపములు – ననర్ధములు భూ ఫలములు
నాశన మగుట ముండ్ల – తుప్పలు మొలుచుట తాపము
= భూకంపము సంతాన – విహీనము భోజన లోపము
విష జంతువుల ప్రతాపము – ఇబ్బంది కరువులు
|| కలుగ ||
7. మనస్సు వేదన గ్రుడ్డి – తనము పిచ్చి చెవుడు కుంటి
తనము వాతములు కాకలు – ను క్షయ ఉబ్బసము తనువున
= కుష్టి మసూచికమును – జ్వరమును వాంతి భేదియు
రక్త స్రావనమును అతిసారము అజీర్తి
|| కలుగ ||
8. నిజముగ దేవుడు పాపపు – నైజంబును మనుజులలో
సృజియించిన పాపియని – పించుకొనడా యోచించుము
= సజ్జనుల కష్టంబును – గూర్చి రక్షించు దేవుడు
విజయము చేసెను – క్రీస్తుగ వృజినమ్ము కలుగజేయునా
|| కలుగ ||
Kalugajeyaledu Ghana Devundaina Lyrics English
Kaluga jeyaledu – ghana devundaina thandhri
Kalal le nattivi – mana kannula kandaga nattivi
= Malina padhaartha mbulu – chethula kantha raanattivi
Balahinamulai nattivi – dushphalamulu, durbuddulu
|| Kaluga ||
Devundaledanutha – ye vasthunaina mrokkutha
Devuni dhooshinchutha – sadbhaavamu lekundutha
= Devuni goorchi yapaarthamu – dhikkarinchi melagutha
Sevalu poojalu maanutha – yeedhi dambu durbuddulu
|| Kaluga ||
Gouravimpaka peddavaar ini – edhirinchutha cher i parula thittutha
Paedavaari chanpi – chanpukonutha ooraka ne somariga
= Gooruchundutha traagutha – peraasha niraasha yasoo ya
Krurathvambu nashubhratha
|| Kaluga ||
Bidhiyamu chendhutha – mohamupadhi vyabhichaaramu
Droh ambadhi kottukonutha – svalaabhamu korakai paatupadutha
= Gudi gopuram u nainanu – tadivi koni dongilinchutha
Chedi jooda maaduthayu – paibadhi lancha lu konutha
|| Kaluga ||
Parula peeru chedagoghottutha – mari chaadeelu chepputha
Karunaleka nan yaayam u – dhoral inchi yasathyamaadutha
= Chiru navvutho mukha sthuthi – cheyutha thwarapadhi yanuma aninchutha
Veruvaka nabaddha saakshya mu – kora kaligedi durbuddulu
|| Kaluga ||
Krutajna thaleka nisthithi – mathilen i thanambu marupu
Matha vaadham ulu ajnaanam u – athi saukhyambu garvambunu
= Sthuthi cheya maani veyutha – mruthi vishwaasamu kalugutha
Prathivishaya mbuna anaagaritha galigina durbuddulu
|| Kaluga ||
Paapa phalithamulai na shaapamulu – nanardhamulu bhoo phalamulu
Naashana magutha mundla – thuppala moluchutha thaapamu
= Bho oka mpamu santhaana – viheenamu bhojana lopamu
Vis ha janthuvula prathaapamu – ibbandhi karuvulu
|| Kaluga ||
Manassu vedhana gruddi – thanamu pichchi chevudu kunti
Thanamu vaath amulu kaakalu – nu kshaya ubbasamu thanuvuna
= Kushti masoochikamunu – jvaramunu vaanthi bhediyu
Raktha sravanamunu athisaaramu ajirthi
|| Kaluga ||
Nijamuga devudu paapapu – nai jambunu manujulalo
Srujiyinchina paapiyani – pinchukonadhaa yochinchumu
= Sajjanula kashtambunu – goorchi rakshinchu devudu
Vijaya mu chesenu – Kreestuga vrujina mmu kaluga jeyunaa
|| Kaluga ||