Shatruvulu Gelvagalara Song Lyrics Telugu
శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు మిమ్మును శపియించు నపుడు – స్తోత్రించుడి దేవుని సూత్రాను సారముగ
|| శత్రు || – (ఆది 1:1)
1. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు యెహోవాను శపియించునపుడు – స్తోత్రించుడి యెహోవాను – శ్రుతిపెట్టి శ్రుతిపెట్టి
|| శత్రు || – (ఆది 9:26)
2. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు మెస్సీయాను శపియించునపుడు – స్తోత్రించుడి మెస్సీయాను శోభిల్లు నట్లుగ
|| శత్రు || – (యోహాను 4:25)
3. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు తండ్రిని – శపియించునపుడు – స్తోత్రించుడి తండ్రిని శుభ లక్షణములతో
|| శత్రు || – (యోహాను 14,15,16)
4. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు యేసును శపియించునపుడు – స్తోత్రించుడి యేసుని – శోకము భీతిమాని
|| శత్రు || – (మత్త 1:24)
5. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు క్రీస్తును – శపించునపుడు – స్తోత్రించుడి క్రీస్తును సుఖ జీవనంబుతో
|| శత్రు || – (లూకా 2:11)
6. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు యేసుక్రీస్తును – చంపినను బ్రతికెన్ – స్తోత్రించుడి యేసుక్రీస్తును – సుస్థిర రక్షకుడంచు
|| శత్రు || – (లూకా 24:6)
7. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు బైబిలును శపియించునపుడు – స్తోత్రించుడి శుద్ధాత్ముని – శుద్ధమౌ మనస్సుతో
|| శత్రు || – (2 పేతురు 1:21)
8. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు సంఘమును – శపియించునపుడు – స్తోత్రించుడి త్రైకుని – శుద్ధుల మోక్షము మనదె
|| శత్రు || – (మత్తయి 28:19)
9. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు భక్తులన్ – శపియించునపుడు స్తోత్రించుడి కిరీటము – తొడుగు తండ్రి నీ మదిలో
|| శత్రు || – (అపో.కా. 7:59)
10. శత్రువులు గెల్వగలరా – మనలన్ నేడు – శత్రువులు గెల్వగలరా
శత్రువులు సువార్తికుని సత్కరింపనపుడు – స్తోత్రించుడి పంపిన – సుతుని ఫలితము నెంచి
|| శత్రు || – (అపో.కా. 1:8)
11. పొదలో కొమ్ములు చిక్కిన – పొట్టేలును – వదలించెను నా తండ్రి
= సొదలో నున్న నన్ను – సూక్ష్మంబుగా లాగి – బదిలియై పగవారి – బంధకములు విప్పును
|| శత్రు || – (ఆది 22:13)
12. యోకోబునకు లాబాను – కీడు చేయ – లేక వెళ్ళిపోయెన్
= మూకతో ఏశావు – ముందునకు వచ్చియు – కాక పడక తమ్ముని – కౌగలించుకొనియెను
|| శత్రు || – (ఆది 33:4)
13. దేవ జనులను ఐగుప్తు – దేశీయులు త్రోవలో తరిమినను
= త్రోవ సముద్రములో – దొరికినను వారిని – ఆవలి యొడ్డున అందు కొనలేరైరి
|| శత్రు || – (నిర్గమ. 14:20)
14. మన సైన్యమే ఎక్కువ – మన శత్రువుల – ఘన సైన్యము కన్నను
= అని ఎలీషా తన సేవ – కునికి చెప్పిన మాట – మనస్సు లోనికి తెచ్చు – కొన్న ధైర్యంబు కలుగు
|| శత్రు || – (2వ రాజులు 6:16,17)
15. దేవునిన్ క్రీస్తు ప్రభుని – బైబిలులోని – భావమును – మత సంఘమును
= సావధానంబుగ – సాంతముగ తెలిసికొన్న దీవెనలు – దీవెనలు – దీవెనలు దీవెనలు
|| శత్రు ||
16. పగవారిన్ క్షమియించుడి – వారికొరకు ప్రార్థనంబు చేయుడి
= పగవారిని దీవించుడి – అని యేసు రక్షకుడు – తగిన బోధ చేసి – తానె మాదిరి చూపెను
|| శత్రు || – (లూకా 6:27,28)
17. మునికోలను తన్నుట – నీకు హాని – అని క్రీస్తు పలుకగ
= విని సౌలు క్రైస్తవు – లను హింసించుట మాని – ఘన బోధకుండాయె – ఖండముల రెంటికిని
|| శత్రు || – (అపో.కా. 9:5)
18. సాతాను గెల్వగలడా – అతనికున్న – దూతాళి గెల్వగలదా
= పాతకములు వాటి – ఫలితములు గెల్చున – పాతాళము గెల్చునా? – ప్రభుని సభకే గెల్పులు