Evarukavale Naku Evarukavale Lyrics Telugu
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసు తప్ప బ్రతుకు నందు – ఎవరు కావలె
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు పేరు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు దర్శనంబు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు వాక్కు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసుని చరిత్ర తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసుని గ్రహింపు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసుని సంఘంబు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసుని ప్రసాదంబు తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు కోరు సేవ తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు జత తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు సిలువ దీక్ష తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసు జయము తప్ప నా – కేమి కావలె
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసులోనే అన్నియును ఇమిడి యుండగా
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = యేసులోనే సంపదలు ఇమిడి యుండగా
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను క్షమకర్త తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను వైద్యుండు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను పోషకుడు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను రక్షకుడు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను బోధకుడు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను మార్గంబు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసులోనే అందరును ఇమిడియుండగా
|| ఎవరు ||
క్రియకు క్రీస్తెగా తుదకు – క్రియకు క్రీస్తెగా = దయకు యేసు క్రీస్తెగా తరచి తరచగా
|| ఎవరు ||
క్రీస్తు క్రీస్తెగా – యేసు క్రీస్తు క్రీస్తెగా = వాస్తవ మైయున్న వ్యక్తి – క్రీస్తు యేసెగా
|| ఎవరు ||
ఎవరు పోయిన – ఏమి పోయిన = యేసునకు యేసె యుండు ఏమికావలె
|| ఎవరు ||
ఎవరు కావలె నాకు – ఎవరు కావలె = యేసను దేవుండు తప్ప ఎవరు కావలె
|| ఎవరు ||
ధరణి యందున – పరము నందున – పరమ = వాసి యేసు తప్ప పరులు లేరుగ
|| ఎవరు ||
ఏమి కావలె నా – కేమి కావలె = పరమ దేవ గ్రంథమైన – బైబిలుండగా
|| ఎవరు ||
నన్ను అందరు – అన్ని విడిచిన = ఎన్నడును విడువనట్టి యేసే కావలె
|| ఎవరు ||
జనక సుతాత్మల్ – శాశ్వతంబుగా = పావన స్తుతులొందుదురు పట్టు పాటతో