యేసునామ స్మరణ చేయండి || Yesunaama Smarana Cheyandi Lyrics

WhatsApp Group Join Now

Yesunaama Smarana Cheyandi Lyrics Telugu

యేసునామ స్మరణ చేయండి – ప్రియులారా క్రీస్తు
– యేసు నామ స్మరణ చేయండి
= యేసునామస్ మరణ వలన – ఎట్టి కష్టమైన తొలగును
యేసునామ స్మరణ వలన – ఎట్టి సౌఖ్యమైన కలుగును
యేసునామ స్మరణ వలన – ఏదిపోదు? ఏది రాదు?

|| యేసు ||

1. యేసునామ స్మరణ మానకుడి
ప్రియులారా క్రీస్తుయేసు నామ స్మరణ మానకుడి
= యేసునామ స్మరణ వలన – ఎట్టి పాపమైన పోవును
యేసునామ స్మరణ వలన – ఎట్టి వ్యాధియైన కుదురును
యేసునామ స్మరణ వలన – ఎట్టి కొదువయైన గడచును
యేసునామ స్మరణ వలన ఎట్టి ఆమెకైన శిశువులు
= యేసునామ స్మరణ వలన – ఎట్టి భూతమైన వదలును

|| యేసు ||

2. క్రీస్తునామ స్మరణ చేయండి – ప్రియులారా యేసుక్రీస్తు నామస్మరణ చేయండి
= క్రీస్తునామ స్మరణ వలన – వాస్తవంబు బైలుపడును
క్రీస్తునామ స్మరణ వలన – స్వస్థి స్థితులు దొరుకుచుండును
క్రీస్తునామ స్మరణ వలన – సుస్థిరంబగు భక్తియబ్బును
క్రీస్తునామ స్మరణ వలన – అస్థి పరము నందు నుండును
= క్రీస్తునామ స్మరణ వలన – క్రియకు అన్నియు లభ్యమగును

|| యేసు ||

3. యేసుక్రీస్తు స్మరణ మానకుడి – ప్రియులారా
క్రీస్తు – యేసునామ స్మరణ మానకుడి
= యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టిదుఃఖమైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టిచింతయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఏ నిరాశయైన ఉండదు
యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టి అజ్ఞానమును ఉండదు
= యేసుక్రీస్తు స్మరణవలన – ఎట్టి భీతియైన ఉండదు

|| యేసు ||

4. యేసునే ధ్యానించు చుండండి
ఏకాంతమందు – యేసునే ధ్యానించు చుండండి
= యేసుని ధ్యానించుటచే – ఏమియును సమయంబు పోదు
యేసుని ధ్యానించుటచే – ఏమియును విశ్రాంతి పోదు
యేసుని ధ్యానించుటచే – ఏమియును పని వెనుకబడదు
యేసుని ధ్యానించుటచే – ఏమియును సుఖంబు తగ్గదు
= యేసుని ధ్యానించుటచే – ఏమియును ఖర్చైపోదు

|| యేసు ||

5. ఇట్టిధ్యానము చేయు చుండిన – మీలోని భక్తి గట్టిపడును కాలక్రమమున
= ఇట్టిధ్యానము వలన మీకు – ఎట్టి అప్పులైన తీరును
ఇట్టిధ్యానము వలన మీకు – ఎట్టి వ్యాజ్యమైన గెలుచును
ఇట్టిధ్యానము వలన మీకు – ఎట్టి నిందయైన గెలుచును
ఇట్టిధ్యానము వలన మీకు – ఎట్టి కలహమైన ఆగును
= ఇట్టిధ్యానము వలన మీకు – వట్టిమాట వట్టిదగును

|| యేసు ||

6. మనుష్య కుమారుండు మనుష్యుడే – ఆపద్ధతిని
= దేవుని కుమారుడు కూడా దేవుండే
దేవకుమారుని బట్టి – దేవుని బిడ్డలము మనము
వాగ్ధానమును బట్టి – దేవుని వారసులమై యున్నాము
యేసుప్రభువు ప్రవక్త యనిన – ఏమి చెప్పిన నమ్మవలెను
ఏ మతస్థులైన నమ్మిన – యేసు మేలు చేయు చుండును
యేసుదేవుడు మన నరుండు – ఎంతగానో మురియవలెను
బైబిలునందున్న క్రీస్తుని – పావన చరిత్ర చదువుడి
యేసు మనలో నున్నాడు – యేసులో మనమున్నాము
= యేసునకు మనమె మనకు – యేసే యుండును ఏమి తక్కువ

|| యేసు ||

7. యేసుక్రీస్తు చరిత్ర వినరండి – భూజనులారా – యేసుక్రీస్తు చరిత్ర వినరండి
= యేసుదేవుడు నరుడు భూ – వాసియాయెను బోధించెను
ధర్మముల మార్గమునందు – తానె నడచి దారిచూపెను
మందు లేకుండగనె జబ్బుల్ – మాన్పె మృతులకు జీవమిచ్చెను
నరులలోని దయ్యములను – తరిమి వేసి సౌఖ్యమిచ్చెను
పాపములను గెల్చి వేసెను – పాపులకాదరణ యిచ్చెను
ఆకలితోనున్న వారికి – అప్పములు కల్పించి పెట్టెను
ఆపద యందున్న వారికి – ఆపద తప్పించి వేసెను
లెక్క లేకుండగను నిత్యము – లెక్కలేని మేళ్ళు చేసెను
వాటినెల్లను వ్రాయ బూనిన – వయసు చాలదు వసుధ పట్టదు
పాప పరిహారంబు కొరకు – ప్రాణ రక్తము బలిగ పెట్టెను
మరణమొందియు తనకు తానె – మరల బ్రతికి పరము వెళ్ళెను
తిరిగివచ్చి భక్తజనులను – పరమునకు కొంచుకొని పోవును
= ఇట్టి దేవుడు ఇట్టి నరుడు – ఎవరును ఎక్కడను లేని

|| యేసు ||

8. యేసుక్రీస్తు సంఘ దేశాలు – మన కాలమందు ఇలకుచేయు మేళ్ళు వినరండి
= గ్రంధ ముద్ర కచ్చు కూర్పులు – క్రైస్తవ దేశాల పనులే
గ్యాసు లైట్లు మెరుపు దీపాల్ – క్రైస్తవ దేశాల పనులే
కార్లు ట్రైన్లు బైసైకిళ్ళు – క్రైస్తవ దేశాల పనులే
కళాశాలలు వైద్యశాలలు – క్రైస్తవ దేశాల పనులే
గాలి యోడలు స్టీమర్లు – క్రైస్తవ దేశాల పనులే
కడను తెచ్చు దుర్భిణీలు – క్రైస్తవ దేశాల పనులే
కడను వ్రాయు టెలిగ్రాములు – క్రైస్తవ దేశాల పనులే
కడను అడ్డు టెలివిజన్లు – క్రైస్తవ దేశాల పనులే
గ్రామఫోనులు బ్రాడ్ క్యాస్టులు – క్రైస్తవ దేశాల పనులే
కండ్ల అద్దాల్ యక్సరేలు – క్రైస్తవ దేశాల పనులే
కలములు మందులు మరలు – క్రైస్తవ దేశాల పనులే
గడియారాల్ ఫోటో గ్రాపులు – క్రైస్తవ దేశాల పనులే
ఇవియు పూర్వమందె గలవని – యెరిగిన వారన్న యెడల
అవి ఇప్పుడు మనకు లేవు – ఇవి కండ్ల యెదుట ఉన్నవి
ఇవియె వాడుక యందు గలవను – ఇచ్చు ప్రత్యుత్తరము సబబు
క్రీస్తు యేసను నీతిసూర్యుని – కీ నీడ స్థలములెన్నో
= యేసుక్రీస్తుని బట్టి సంఘము – ఎట్టి మేలును చేయుగాక

|| యేసు ||

9. లక్ష యాభై వేలు వచ్చును – నీ పేరుమీద లక్ష యాభై వేలు వచ్చును
= లక్ష యాభై వేలు రాగా – రక్షణార్ధమైన పనులకు – లక్షణముగా
వాడినప్పుడు లక్షలాది వచ్చు చుండు

|| యేసు ||

10. నామప్రార్థన చేయు చుండండి రక్షకునికున్న – నామప్రార్ధన చేయు చుండండి
= యేసు అనగా రక్షకుండు – ఎవరినైనను రక్షించును
క్రీస్తు అనగా నియమితుండు – కేవల మేర్పాటు పురుషుడు
దేవుడొకడె క్రీస్తునొకడె – దేవుని గ్రంధంబునొకటె
సంఘమొకటె ఐఖ్యమొకటె – సత్య సిద్ధాంతమును ఒకటె
= మహిమ జీవన మొకటె – మోక్ష మందిరమును ఒకటె ఆమేన్

|| యేసు || 

Leave a Comment