Aanandakaramainadi Mana Brathukentho Lyrics Telugu
ఆనందకర మైనది – మన బ్రతుకెంతో – ఆశ్చర్యకర మైనది
మన బ్రతుకెంతో – అద్భుత కరమైనది – మనబ్రతుకెంతో
ఉపయోగకర మైనది = జ్ఞాని నేత్రములకు ఆనున్ గాని
యితర = మానవుని నేత్రాల – కానుటెట్లుండును
|| ఆనంద ||
1. భూమి మన గృహ మాయెను ఆకాశ మీ – భూమికి కప్పాయెను
= అ మింట సూర్య చం – ద్రాదులు దీపాలు
యే మనుజుడైనను – ఎప్పుడు నార్పలేడు
భూమి నాకాశము – పూర్తిగా మార్చెడు
స్వామియె మనకు – శా – స్వతమైన దీపంబు
= ఈ మానవ పాపి – ఎంత ధన్యుండాయె
|| ఆనంద ||
2. సృష్టియంతటి లోను – మనమె వింత – సృష్టిగ నేర్పడినాము
= సూర్యుడు చంద్రుడు – చుక్కలు మన కొరకె
నీడ నిచ్చు మబ్బు – నింగియు మన కొరకె
కంటికి కనబడని – గాలియు మన కొరకె
ఆకారముండని ధూ – తాళియు మన కొరకె
దప్పి తీర్చు వర్ష – ధారయు మన కొరకె
= మనమెంత ధన్యులము – మన మెంత ధన్యులము
|| ఆనంద ||
3. భూమి మన ఇల్లాయెను – దాని యందు = యే మున్న సొత్తాయెను
= భూమి లోపలి గనులు – భోషాణపు ధనమాయె
భూమి మూలికల్ రోగ – ములకు ఔషదమాయె
భూమి మన్నును రోగ – ములకు మందాయె
భూమిపైని పంట – భోజనాస్పదమాయె
= భూమి మనకు స్వేచ్చ – గ మసలు స్థలమాయె
|| ఆనంద ||
4. రంగు పూసిన పక్షులు – పాటలు పల్కు – సంగీత సామాజికులు
= శృంగార వనములు – చెట్లపై ఫలములు
నింగి కిరాణాలెన్నో – రంగులద్దిన పువ్వుల్
వంగి నీళ్ళు త్రాగు – పశువులు మృగములు
పొంగి ప్రవహించెడి – పొడుగు నదులు వాగుల్
= మంగళ ధ్వనులతో – మహిమ పర్చుడి తండ్రిన్
|| ఆనంద ||
5. విసన కర్రతో తండ్రి – మనకందరకు – విసరు చున్నాడా యేమి!
= విసరకున్న త్వరగ – విశ్వము నశియించు
బస యెక్కడో గాలి – పరుగెక్కడికో గాని
ఇసుమంతయు మన – మెరుగకున్నాముగ
విసుగుదల యెందుకు? – విసరు చలువ గాలి
= మసలు చున్నప్పుడే – మహిమ పర్చుడి తండ్రిన్
|| ఆనంద ||
6. అందరకును నిత్యము – కావలసిన – వన్ని గలవు సృష్టిలో
= అందించు మన తండ్రి – అందుకొనుట మనము
వందనము చేయుట – అందుకొనుట లెక్క
కందని నక్షత్రా – లన్ని సరకులె మనకు
ఎందరు వాడిన – ఎన్నో మిగిలి యుండు
= అందించిన వందిన – అందరము ధనికులమే
|| ఆనంద ||
7. ఎండకు పన్ను లేదు – అది ఉచితంబు – ఎవరును పన్నడగరు
= వెన్నెలకు పన్ను లేదు – విభుడడుగడు పన్ను
గాలికి పన్ను లేదు – ఏలికడుగడు పన్ను
వర్షానికి పన్ను లేదు – వారసుడడుగడు పన్ను
మొలుచుటకు పన్నులేదు – ముఖ్యుండడుగడు పన్ను
జన్మానికి పన్ను లేదు – జనకుడడుగడు పన్ను
వయసుకు పన్ను లేదు – పరమాత్ముడడుగ బోడు
ధరకు పన్ను లేదు – తండ్రి పన్నడుగడు
తగిన స్తుతి చేయుటే – తండ్రికిచ్చు పన్ను
తగినట్లు నడచుట – తండ్రికిచ్చు పన్ను
= తండ్రిన్ ప్రకటించుటయే – తండ్రికిచ్చు పన్ను
|| ఆనంద ||
8. ఇన్ని నీకై చేసిన – నీ తండ్రి నీ – వేమి యడిగిన ఇయ్యడు?
= ఎన్ని సృజించెనో – అన్ని వాగ్ధానాలే
ఇన్నిటిలో నీకు – ఎన్ని కావలయునో
అన్నియు నీ తండ్రి – అందించు చుండును
ఎన్ని సందేహాలు – ఉన్న త్రోసి వేసి
నిన్ను నమ్మిన తండ్రిన్ – నీవు నమ్మవలయు
ఇన్నిటిలో నీవె – ఎక్కువ తండ్రికి
నిన్ను బట్టి లోక – నిర్మాణము చేసె
అన్నిటి కన్న నీ – కధికుండు నీ తండ్రి
= ఖిన్నుడవై యుండకున్న – జరుగును అన్ని
|| ఆనంద ||