Sthimithamu Ledu Gada Lyrics Telugu
స్థిమితము లేదు గదా – మానవునికి – క్షితి యందు శ్రమలే గదా
= శ్రమలే ఎచ్చోటను – శ్రమలే ఏ వేళను
శ్రమలు పోగా క్రొత్త – శ్రమలు వచ్చు చుండును
శ్రమలే మనము బ్రతుకు – సమయంబు పొడుగున
శ్రమ పెట్టుచున్నవి – సౌఖ్యమేది మనకు
= తమలో కొందరిట్లు – తలచుకొను చున్నారు|| స్థిమి ||
1. మంచు రాత్రులు హాని – పిమ్మట వచ్చు – మండు వేసవి హాని
= వానా కాలము హాని – వరద దినములు హాని
గాలివాన హాని – ధూళి మేఘము హాని
= ప్రతికాలమును హాని – బ్రతుకంతయును హాని
|| స్థిమి ||
2. నీటి యోడలు హాని – ప్రయాణములో – నింగి యోడలు హాని
= బండ్ల మీద హాని – వంతెనపై హాని
గనులలోను హాని – పనులన్నిటను హాని
బాటయందున హాని – ఆటయందున హాని
ఒంటియందున హాని – ఇంటియందున హాని
= యుద్ధభూమి హాని – యుద్ధాయుధము హాని
|| స్థిమి ||
3. ద్రవ్య భాగ్యము హాని – ఇబ్బందులును – దారిద్ర్యంబును హాని
= దొంగ దోపిడి హాని – దూబరి తనము హాని
అప్పు చేయుట హాని – అప్పు తీర్చక హాని
జబ్బు వల్ల హాని – చావు వల్ల హాని
= ప్రతి స్థితియును హాని – బ్రతుకంతయును హాని
|| స్థిమి ||
4. వేని వలన మేలో – వాని నమర్చి – పెట్టి యున్నాడు తండ్రి
= గాని ఆదిలోనే – మానవ జాతిలో
కాని గుణము చేర – గానే కీడే ప్రతి
దానిలో చొర బడుచు – మానవ హృదయాల
= లో నున్న దైవాభి – మానమున్ తొలగించె
|| స్థిమి ||
5. విషపు పురుగులు హాని – దూరాన గల – విపిన మృగములు హాని
= పెంపుడు జీవులగు – పిల్లి కుక్క హాని
శత్రువులును హాని – మిత్రులును హాని
బంధువులును హాని – పర జనులును హాని
అధికారులు చేయు- అన్యాయము హాని
వారి మీదను తిరుగు – బాటు చేయుట హాని
రాలు కొండలును లో – హాలు ఇసుకయు హాని
కాయ గూరలు వృ – క్షాదుల్ మూలికల్ హాని
= అన్నియును హాని – అందరును హాని
|| స్థిమి ||
6. అన్ని వేళల హాని – మనకందరకును – అన్ని ప్రక్కలును హాని
= భూమి శాపము బొందె – ముండ్లందు చేతనె
చెమటోర్చి పురుషుండు – సేద్యంబు జేయును
ప్రసవ వేదన స్త్రీకి – ప్రాణ భీతిగ నుండు
బిడ్డలు లేకున్న – బిడియముగా నుండు
భార్య భర్తల మైత్రి – పాడై పోవుచు నుండు
ఎంత జాగ్రత్తయున్న – యెదోయొక జబ్బుండు
ఎప్పటికైనను – తప్పదు మరణంబు
వాన కురియకున్న – పంట పండదు కరువు
వాన అధికమైన – పంట నాశనమౌను
పిడుగు తప్పుకొనెడి – వీలు లేక యుండు
= భూకంపమున పారి – పోవు – గడువుండదు
|| స్థిమి ||
7. వాదాలు అలల వలెనె – జన సముద్రాన – వాగు చున్నవి ఘోష
= భేదాభిప్రాములు – ఛేదించు చున్నవి
వేదించు మనస్సును – విశ్రాంతి యుండదు
సాధించి పంతాలు – సఫలులౌ చుందురు
మాది సరియైనది – మీదే సరిగాదంచు
వేదాలలో నుండి – వివిధ వచనా లెత్తి
= బోధింప నుభయులకు – పోరాటములు గల్గు
|| స్థిమి ||
8. దేవుడే ఉన్న యెడల – మనకీ కష్ట – స్థితులుండుట యెందుకు?
= సాతానును ఏల – చంపి వేయలేదు?
పాపమాది నేల – ఆపు చేయలేదు?
పాప విసర్జన – బలమేల ఇయ్యడు?
పడు వరకును ఉండి – పడగ, పడగ, పడగ,
నరకమున వేయుట – న్యాయమై యుండునా
పాపములు చేయించు – వాడునతడె అతడె
చేసిన తరువాత – శిక్షించు వాడతడె
ఇదియేమి న్యాయంబు – ఎవరికిది సరిపడును
= ఈరీతిగా తప్పు – లెంచు చున్నారకట
|| స్థిమి ||
9. దేవ వ్యక్తియే లేడు – మోక్షము లేదు – దేవ దూతలును లేరు
= సాతానులేడు పి – శాచములు లేవు
శాశ్వతమగు నరక – స్థలము లేనే లేదు
మనసు సబబుగ నెంచు – పనులు చేయవచ్చు
నరులిన్ని శ్రమలందు – నలిగిపోవు చుండ
తండ్రి ఊరుకొనుట – దయకాదు దయకాదు
అనుచును కొందరు బో – ధన చేయు చున్నారు
ఇన్ని మాటలేల – ఇదిగో మీకొక సలహా
= ధ్యానములో నుండండి – జ్ఞానమిచ్చును సలహా
|| స్థిమి ||
10. పాపంబు భువికి వచ్చె – దానివలన – శాపంబు గూడ జొచ్చె
= పాపంబుల కన్న – పాప ఫలితంబులె
ఎక్కువ బాధగ – ఎంచు చుందురు జనులు
పాప పరిహారము – శాప పరిహారంబు
కోరువారు త్వరగ – మారుమనసు పొంది
మోక్ష లోకము జేర – మొదట స్పష్ట మైన
= అది దేవుని కృపను – ఆశ్రయించిన మేలు
|| స్థిమి ||
11. అందరకును దేవుడు – అడిగిన యెడల – అగుపడడు ఎందుకు?
= అగుపడుచును, మాట – లాడ కుండుట యేల?
కలలు దర్శనములు – కల్ల, కల్ల, కల్ల
లేని దేవుని తలచి – లేని వారైనారు
దేవుడు లేడనుట – స్థిరమైనట్టి బోధ
పాటుపడిన మనకు – బ్రతుకు వర్ధిల్లును
ప్రార్ధనల వల్ల – ఫలమేమియును లేదు
కొందరిట్లు విసుగు – కొనుచు అనుచున్నారు.
|| స్థిమి ||
12. వివిధ మతముల వల్లనే – సహవాసము – విచ్చిన్నమై పోయెను
= బోధలలో చాలా – భేదాలు కనిపించు
ఒకరిట్లను చున్నారు – ఒకరట్లను చున్నారు
ఏది సత్యంబో తల – ఎగిరి పోవుచున్నది
మత భేదము లితర – మత భక్తులను చంపె
తండ్రి దొక మతమాయె – తనయుని దొక మతమాయె
మతము వల్ల ఈ – మనుజుడు చెడిపోయె
మతము లెందుకు మనకు – మతి చెడుటకే గాని
అని కొందరు యిట్లు – అడుగు చున్నారయ్యో
మతములన్నియు నొక్క- మతముగ గల్పిన
నేడు మనకందరకు – నిండు నెమ్మది దొరుకు
|| స్థిమి ||
13. పరిశుద్ద దేవుడెట్లు – కారకుడౌను – పాపంబులకు ఫలములకు
= పరిశుద్ధుడే నరుని – పాపానికి నడిపిన
పరిశుద్ధుడే గొప్ప – పాపాత్ముడై యుండు
తల్లి తను కనియున్న – పిల్లన్ చెడ గొట్టునా!
సృష్టికర్త యేల – సృష్టిన్ చెడగొట్టును?
పరిశుద్ధ దేవుని – పద్దతుల్ విషయాలు
సరిగ తెలియకున్న – సద్ధణిగి యుండుట
నరునికి క్షేమంబు – నరునికి సౌఖ్యంబు
ఉన్న దేవుడు లే – డన్న మాట విన్న
ఉన్నాడని నమ్ము – కొన్న చూడ బోగా
ఉన్న పరలోకమున- ఉత్సహింపగలము
ఉన్న లేడన్న యెడల – ఉండకుండునే? క్షోభ
|| స్థిమి ||
14. తన దివ్య లక్షణములు – దేవుడాదిన్ – మనలో పెట్టివేసెను
= సరిగా వాటిని వాడు – స్వాతంత్ర్య మిచ్చెను
అది వాడనప్పుడు – అపరాధము గలుగును
తప్పు తెల్పు జ్ఞాన – దారుఢ్యము గలదు
గనుక దేవుని వేడ – గల్గును విజయంబు
దేవునిలో తప్పు – దేవినా కనపడదు
అందుచే దేవునికి – వందనార్పణ తగును
అపరాధ కాలమున – అడ్డు వచ్చిన యెడల
ఇచ్చిన స్వాతంత్ర్య – మియ్యనట్టె యగును
కొన్నిటిలో ఊరు – కొనడు హేతువు గలదు
ఊరకె ఉండుట – ఊరుకొన కుండుట
= కనిపెట్టి దేవుని – ఘన పర్చుట మేలు
|| స్థిమి ||
15. లోకాలు వాటికవియె – కల్గెనుగాని – ఏ కారకుడును లేడు
= అని కొందరను కొనుచు – హర్షించు చున్నారు
దైవమును తనకు – తానే కల్గినాడు
అని ఎందుకనరాదు – అని అడుగుట సబబు
సృష్టి నైజంబు మన – దృష్టికి అగబడుట
దైవ నైజంబు మన – దృష్టికి కానకుండు
తలపులు కూడ మన – కన్నులకు కానకుండు
కనబడనివి లే – వని చెప్పవచ్చునా!
దేవుండు పావనుండు – దేవుండు జ్ఞానియును
శక్తి మంతుండునై – సర్వ కార్యంబులు
క్రమము ననుసరించి – కలిగించి యున్నాడు
మానవుని పోలిన – మానవుండు లేడు
పక్షిని పోలిన – పక్షియును లేదు
వస్తువును పోలిన – వస్తువును లేదు
దేవుడెంత గొప్ప – దేవుడై యున్నాడు
స్తోత్రంబుల వెంబడి – స్తోత్రములు చేయుదము
|| స్థిమి ||
16. తమది ఏమతమును కాదు – అని కొందరు – తరచుగా అనుచున్నారు
= అట్లు అనుటవారి – అనుకూల మతమగును
ఏ నలుసు మతమైన – లేని నరుడే లేడు
సమ్మతమే మతమన్న – సామెత గలదొకటి
జ్ఞానమే సంగతులు – మానవునికి తెల్పును
తన మనస్సాక్షియె – అనుమతించును వాటిన్
ఈ రెండును మనకు – హిత బోధ చేయును
గాని ప్రతి దినమును – ధ్యానింప వలయును
అప్పుడు మనశ్శాంతి – ఆవరించు కొనును
ప్రతి తలంపునకును – ప్రతి నోటి మాటకును = ప్రతి కార్యమునకును – ప్రతి ఫలముండును
|| స్థిమి ||
17. నరులకు స్వాతంత్ర్యము – దేవుడిచ్చు – వరములలో ముఖ్యము
= పనిలో వరములు వాడు – కొనుటకది సాధనము
ఎవరి మతమువారు – వివరించు కొనవచ్చు
గాని భేదమున్న – కలహింప కూడదు
ఏమతము నైనను – ఏ మనుష్యునైనను
తుంచనాడుట మిగుల – దోషమై యుండును
= సహ మానవుల నెల్ల – సన్మానింప వలయు
|| స్థిమి ||
18. బోధలన్నిటి కన్నను – ఎక్కువైన – బోధ వినిపింతునిప్పుడు
= దినమున కొక గంట – మనసున మీ అంశ
మును ధ్యానమున బెట్టి – కనిపెట్టు చుండిన
అనుకొన్నవి మీకు – అవలీలగా దొరుకు
హిందూదేశము లోని – ఋషులు దీర్ఘధ్యాన
కాలము నెంతయో – గౌరవించి రనుట
అతిశయోక్తి కాదు – ఆనందకరమైన
వృత్తాంతముగ నెంచి – వివరించు కొనవలయు
చెప్పవలసిన వన్ని – చెప్పినాము ధ్యాన
= మాపకున్న పార – మార్ధికు లౌదురు|| స్థిమి ||