మానవుడు శ్రమను పొందక దైవ || Manaavudu Sramanu Pondaka Daiva Lyrics

WhatsApp Group Join Now

 Manaavudu Sramanu Pondaka Daiva Lyrics Telugu

మానవుడు శ్రమను – పొందక దైవ –
మానవుడెటు కాగలడో = కానక బడిన –
వానిని దైవ మానవునిగా చేయంగ –
శ్రమలు పరమా – శ్రమము చేసె

|| మాన ||

1. కాలకుండ నే – మేలిమి యగునే –
కనకము కొలిమి యందు = కాలిన మష్టు –
రాలిపోవును – కలుగును విలువగు కాంతి –
ఆలాగుననే – ఈ లోకమున

|| మాన ||

2. విజయుడు యోబును – ఋజువు చేయనై –
వృజిన మూర్తికిడె సెలవు = నిజ సౌఖ్యంబు –
నిలిచి పోయెను – భుజములపై శ్రమ లున్న –
భక్తి పోదు – రక్తి పోదు

|| మాన ||

3. పశువులు భాగ్యము – బిడ్డలు పోయి –
నష్టము కలిగిన గాని = అసువులూడిన విసుగు పడునె –
యశము గణింపడె యోబు – సణగ కెపుడు –
సంతోషించుము

|| మాన ||

4. నిందలు అవమా – నములు దూషణ –
గందర గోళములున్నా = నెందును దేవుని –
దూషింపక కడు – భూషించెను గదా యోబు –
సందియములు – చాలించు మిక

|| మాన ||

5. హితుల తర్కము – సతి దూషణములు –
నతి కల్పన లుండినను = అతనిభక్తి –
అధికంబాయె – అదియేగద నిజ భక్తి –
మతిదలంచి – నుతి చేయుమిక

|| మాన ||

6. శ్రమలుపకారం – శ్రమలే హారం –
శ్రమలాత్మకు శృంగారం = శ్రమలవల్లనే –
సకల స్వనీతి – సమసి పోవును గాన –
శ్రమలయందే సంతోషించుము

|| మాన ||

7. ఎన్ని శపించిన – తన జన్మమునే –
తననె శపించును గాని = ఎన్నడు దేవుని –
ఏమియు ననడు – ఎంతటి దొడ్డబుద్ధి –
బుద్ధి – గలిగి పూజింపుమిక

|| మాన ||

8. మహిని యేసే – మహా శ్రమ పొంది –
మహిమకు వెళ్ళెనుగాదే = మహిమ కోరని –
మనుజుడెవ్వడు – మర్యాదగా నెవడిచ్చు –
శ్రమలులేక – స్వర్గము లేదు

|| మాన ||

9. శ్రమల మార్గమే – విమల మార్గము –
శ్రమ భక్తుని కాశ్రమము = శ్రమలే సంపూ –
ర్ణంబగు దైవ – మానవునిగ జేయు గదా –
శాంతి గలుగు – కాంతి వెలుగు

|| మాన ||

10. పేద క్రైస్తవుడా – సేద దీర్చుకో –
నీదే గదాయా ముక్తి = బాధలు –
పొందిన ఖేదము పొందకు – వాదము లాడకు మరల –
మోద మొందుము – మోక్షమొందుము

|| మాన ||

Manaavudu Sramanu Pondaka Daiva Lyrics English

Manaavudu srama nu – pondaka daiva –
Manaavude tu kaagala do = kaanaka badina –
Vaanini daiva maanavuniga cheyanga –
Srama lu parama – srama mu chese

|| Mana ||

Kaala kundane – melimi yagune –
Kanakamu kolimi yandu = kaalina mashtu –
Raalipovunu – kalugunu viluvagu kaanti –
Aala guna ne – ee lokamunu

|| Mana ||

Vijayudu yobunu – rujuvu cheyanai –
Vrujina murti ki de selavu = nija saukhyambu –
Nilichi poyenu – bhuja mula pai srama lunna –
Bhakti podu – rakti podu

|| Mana ||

Pashuvulu bhaagyamu – bidda lu poyi –
Nashtamu kali gina gani = asuvulu dina visugu padune –
Yashamu ganimpade yobu – sanaga kepudu –
Santosinchumu

|| Mana ||

Nindalu avamaa – namulu dushana –
Gandara golamulunna = nendunu devuni –
Dushimpaka kadu – bhooshinchenu gada yobu –
Sandiya mulu – chaalinchu mika

|| Mana ||

Hitalu tarkamu – sati dushanamulu –
Nati kalpana lundinanu = atani bhakti – adhikamba ye –
Adiye gada nija bhakti – mati dalanchi –
Nuti cheyumika

|| Mana ||

Sramala upakaaramu – sramale haaramu –
Sramalaatmaku srungaaramu = sramala vallane –
Sakala svaneeti – samasi povunu ga na –
Sramala yande santosinchumu

|| Mana ||

Enni shapinchina – tana janma mune –
Tanane shapinchunu gani = ennadu devuni –
Emiyu nanadu – entati dodda buddhi –
Buddhi – galigi poojimpumika

|| Mana ||

Mahini yesee – maha srama pondi –
Mahimaku vellenu gaade = mahima korani –
Manujudevva du – maryadaga neva dichchu –
Sramalu leka – svargamu ledu

|| Mana ||

Sramala maargame – vimala maargamu –
Srama bhaktuni kaashramamu = sramale sampoorna –
Mbagu daiva – maanavuniga je yu gada –
Shaanti galugu – kaanti velugu

|| Mana ||

Peda kraistavudaa – seda deechuko –
Needae gadaaya mukti = baadhulu –
Pondina khedamu pondaku – vaadamu laadaku marala –
Moda mondumu – mokshamondumu

|| Mana ||

Leave a Comment