Neeveyani Nammika Yesu Naaku Lyrics Telugu
నీవే యని నమ్మిక – యేసు నాకు – నీవే యని నమ్మిక =
నీవే మార్గంబు నీవే సత్యంబు – నీవే జీవంబు – నీవే సర్వంబు
|| నీవే ||
1. పెడదారిని బోవగా – నా మీదికి – యిడుమలెన్నియో రాగ =
అడవిలో బడి నేను – అడలుచు నుండగ – తడవకుండ దొరుకు – ధన్యమౌ మార్గంబు
|| నీవే ||
2. తడవని దారిదొరుక – దానింబడి నే – నడచు టెట్లో తెలియక జడియు చుండగ =
నన్ను జాగ్రత్తగా కడకు – నడిపించు కొని వెళ్ళు – న య మార్గ దర్శివి
|| నీవే ||
3. కారు మేఘము పట్టగ – నా మనస్సులో – కటిక చీకటి పుట్టగా =
ఘోరా పదల జేరి – దారియని భ్రమ పడగ – తేరి చూడగల్గు – తేజోమయ మార్గంబు
|| నీవే ||
4. లేనిపోని మార్గంబు – లెన్నోయుండ – జ్ఞానోపదేశంబు =
మానుగ జేయుచు – వానిని ఖండించి – నేనే మార్గంబన్న – నిజమైన మార్గంబు
|| నీవే ||
5. ఎటు జూచిన మార్గములే – మోసము చేయు – హీన శత్రు వర్గములే =
ఎటు బోవ వలయునో నే – నెరుగని వాడనై – కట కట యని యేడ్వ – ఘన మోక్ష మార్గంబు
|| నీవే ||
6. జబ్బు మరల ముదరగ – కల దైర్యంబు – జారి గుండె లదరగా =
నిబ్బరముగా మనసు నిలువక యున్నపుడు – దబ్బున నను జేర్చు దయ గల వైద్యుడవు
|| నీవే ||
7. నరలోకము నుండి – పరలోకంబు – వరకు నిచ్చెనగా నుండి =
నరులకు ముందుగా – నడచుచు ముక్తికి – సరిగాకొనిపోవు సు – స్థిరమైన మార్గంబు
|| నీవే ||
8. ధైర్యంబుగా నుండుము – ఓ విశ్వాసీ – ధైర్యంబుగా నుండుము =
ధైర్యంబుతో దేవుని – ఆత్మతో స్తుతియించి – వచ్చిన శ్రమల లో ఆనందించుము
|| నీవే ||
9. నీకు తోడై యుంటిని – నీ మనవిని ఆలించి యుంటిని =
అన్నిటి నుండి నిన్ ఆదరించిన తండ్రిన్ – ఆనందముతో – స్తోత్రించు చుండుము
|| నీవే ||