ఏకాంత స్థలము కోరుము || Ekaanta Sthalamu Korumu Lyrics

WhatsApp Group Join Now

Ekaanta Sthalamu Korumu Lyrics Telugu

ఏకాంత స్థలము కోరుము – దేవుని ప్రార్థింప =
ఏకాంత స్థలము చేరి – మోకాళ్ళ మీద వుండి లోకాశలను మదికి రాకుండ చూచు కొనుము

|| ఏకాంత || 

1. ఊహలోని పాపములను – ఒప్పుకొనుము తండ్రియెదుట =
దేహము లోపల కవియె – దిగుచు నిన్ను బాధ పెట్టును

|| ఏకాంత || 

2. మాటలందలి పాపములను – మన్నించుమని వేడుకొనుము =
ఆట పాటలందు మాట – లాడుటయు నేరంబులగును

|| ఏకాంత || 

3. చేయబోయి మాను చెడ్డ – చేతలన్ని ఒప్పుకొనుము =
ఈ యత్న పాపంబు లెల్ల – ఎన్నిక లోనికి వచ్చును గాన

|| ఏకాంత || 

4.పాప క్రియలు అని దుఃఖముతో – ప్రభుని యెదుట ఒప్పుకొనుము =
పాపము మరల చేయనట్టి – ప్రయత్నంబుల్ చేయవలెను

|| ఏకాంత || 

5. ఎవరిని అల్లరి పెట్టినావో – వారి యొద్ద ఒప్పుకొనుము =
ఎవరి యొద్ద చెప్పినావో – వారియొద్ద ఒప్పు కొనుము

|| ఏకాంత || 

6. తప్పు వినుట సరదా యైన – తప్పే తప్పు ఒప్పు కొనుము =
తప్పు తట్టు ఆకర్షించు – తగని ఆట పాట లేల

|| ఏకాంత || 

7. కలలో చేసిన తప్పులెల్ల – కర్త యెదుట ఒప్పుకొనుము =
తలపులో లేనిది యెట్లు – కల లోనికి వచ్చి యుండును

|| ఏకాంత || 

8. నిన్ను మరల సిలువ వేసి – యున్న పాప జీవినయ్యో =
నన్ను క్షమియించుమని – యన్న నరులు మారు వారు

|| ఏకాంత || 

9. చెడుగు మాని మంచి పనులు – చేయకున్న పాపమగును =
పడియు లేవకున్న గొప్ప – పాపమగును పాపమగును

|| ఏకాంత || 

10. దుష్టులు వర్ధిల్లుట చూచి – కష్టము పెట్టుకొనరాదు =
కష్టము పెట్టుకొన్న నీవు – దుష్టుడవుగా మారినట్టే

|| ఏకాంత || 

11. భక్తిపరుల శ్రమలు చూచి – భక్తిహీనులని యనవద్దు =
భక్తుల శ్రమలకు ముందు – బహుమానంబు దొరుక గలదు

|| ఏకాంత || 

12. బీదల కాహారము బెట్ట – వెనుకదీసి పొమ్మన రాదు =
నీ ధనము నీకే కాదు అది – నిను గని దేహి! యను వారికిని

|| ఏకాంత || 

13. రోగులను దర్శింప బోవ – రోతయని భావింపవద్దు =
బాగుపడు పర్యంతము వరకు – పరిచర్య చేయుట మెప్పు

|| ఏకాంత || 

14. ఎట్టి యబద్దాలు పలుకు – నట్టి వారికి నరకమంచు =
చిట్ట చివరి పుస్తకంబు – చెప్పునది యోచన చేయుము

|| ఏకాంత || 

15. జీవరాసులను బాదుట – జీవహింస నేరమౌను =
దేవుడు నిన్నడుగజెప్పు – తెగువ గలుగ గలదా నీకు

|| ఏకాంత || 

16. ఒకరి వంక మీద పెట్టి – ఒకరి ననుట పిరికితనము =
ముఖము యె దుట అడిగి స్నేహ – మును గలిగించు కొనుట మెరుగు

|| ఏకాంత || 

17. గుడిలో కూర్చుని కార్యక్రమము – గుర్తింప కుండుట యశ్రద్ధ =
చెడగొట్టి వేయు చుండు – పెడచూపు మనో నిదానము

|| ఏకాంత || 

18. వాక్యాహారము తినని యెడల – బలమాత్మకు లభించుటెట్లు =
వాక్య గ్రంధములోని దేవుని – పలుకు వినక నడచుటెట్లు

|| ఏకాంత || 

19. దిన ప్రార్థనలు చేయని యెడల – దేవుని శ్వాస పొందు టెట్లు =
మనసులోని స్వీయ శ్వాస – మలినము పోవుటెట్లు

|| ఏకాంత || 

20. పరులకు బోధించు సేవ – జరుప లేక యున్న యెడల =
పరమ భక్తి పరులకైన – బహుమానంబు దొరుకుటయెట్లు

|| ఏకాంత || 

Leave a Comment