దేవ దేవుని మ్రొక్కలెండి || Deva Devuni Mrokkalendi Lyrics

WhatsApp Group Join Now

Deva Devuni Mrokkalendi Lyrics Telugu

దేవ దేవుని మ్రొక్కలెండి
ఓ ప్రియులారా దేవరాజుని గొల్వరండి
లేవంగానే తర్వగా దేవుని స్మరియించి
ఆ వెనుక మీ పనులు ఆరంభించుట మేలు

|| దేవ ||

1. మంచము దిగగానె మొదట
మోకాళ్ళూని మనతండ్రిని తలంచుకొనుట
మంచి పనులన్నిటిన్ మించిన పని యౌను
కొంచమైనను బద్దకించుట సరికాదు

|| దేవ ||

2. అన్నము తినుటకు ముందు
వందనములు ఆచరించుట గొప్ప విందు
అన్ని దేవుడు మీకు అందించునని నమ్ము
కొన్న యెడల అందుకొందురానందముతో

|| దేవ ||
 

3. పయనమై ప్రార్ధించుకొండి
దేవుడు మిమ్ము పదిలమ్ముగా నడుపునండి
భయము కల్గదు మీ బాట చదునైయుండు
రయముగా వెళ్ళుదురు రంజిల్లు మీ మనస్సు

|| దేవ ||

4. ఆపదలో ప్రార్ధించుకొండి అది తప్పును
అపుడాయనను స్తుతించండి
మీపైన దేవునికి మెండైన ప్రేమయని
ఈ పనిలో మీరు గ్రహించు కొనవలయును

|| దేవ ||

5. ఇబ్బందిలో ప్రార్ధించండి అది తీరును
ఎంతో సంతుష్టి పొందండి
జబ్బులో ప్రార్ధించి స్వస్థత నొందండి
అబ్బును దేవుని ఆశ్రయించెడి వాలు

|| దేవ ||

6. దేవుడే మన మానవుఁడై
యేసుక్రీస్తుగా వెలసి తిరిగెనీ యిలపై
చావొంది చావును చంపి జీవించెను
కావున మనకు మోక్షంబు నమ్మిన యెడల

|| దేవ ||

7. ఎన్ని తిరిగిన పోవు పోవు పాపంబులు
ఎంత ఏడ్చిన పోవు పోవు
ఎన్నాళ్ళు పుణ్యక్రియ లెన్నిచేసిన పోవు
అన్ని చేసిన క్రీస్తునందు నమ్మిన గాని

|| దేవ || 

Deva Devuni Mrokkalendi Lyrics English 

Deva devuni mrokkalendi
O priyulaara deva raajuni golvarandi
Levangaanai tarvagaa devuni smariyinch i
Aa venuka mee panalu aarambhinchuta melu

|| Deva ||

1. Manchamu digagaan e modata
Mokaalluni manatan drini talan chukonuta
Man chi panulan niti n minchina pani yaunu
Kon chamai na bad dakinchuta sarikaadu

|| Deva ||

2. Anna mu tinutaku munda
Vandana mulu aachar in chuta goppa vindu
An ni devudu meeku andin chunan i nam mu
Kon na yedala andukon duranandamuto

|| Deva ||

3. Payana mai praarthin chu kon di
Devudu mimmu padilam mugaa nadupu nan di
Bhaya mu kalgadu mee bhaata chaduna iyun du
Raya mugaa velluduru ranjillu mee manasu

|| Deva ||

4. Aapadalo praarthin chu kon di adi tappunu
Apudaayanu stutinchandi
Meepain devuniki mendai na prema yani
Ee panilo meeru grahinchu konavala yunu

|| Deva ||

5. Ibbandilo praarthincha n di adi teerunu
Ento san tushti pon dan di
Jabbulo praarthinchi svasthata non dan di
Abbunu devuni aashrayin chedi vaalu

|| Deva ||

6. Devudae mana maanavun dai
Yesukristugaa velasi tirigenei ilapai
Chaavondi chaavunu chanpi jeevinchenu
Kaavuna manaku moksham bu namm in yedala

|| Deva ||

7. Enni tirigina povu povu paambulu
Enta yedchina povu povu
Ennalu punya kriya lenniche sina povu
An ni chesina kristunandu namm in gaani

|| Deva ||

Leave a Comment